శివకుమార్ ఆల్‌రౌండ్ ప్రదర్శన

శివకుమార్ ఆల్‌రౌండ్ ప్రదర్శన


సాక్షి, హైదరాబాద్: శివకుమార్ (సెంచరీ, 6 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో గ్రీన్‌లాండ్స్ జట్టు 253 పరుగుల తేడాతో ఇంపీరియల్ జట్టుపై భారీ విజయాన్ని సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గ్రీన్‌లాండ్స్ 50 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 387 పరుగుల భారీస్కోరు చేసింది. శివకుమార్ (93 బంతుల్లో 115, 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కాడు. నూతన్ కళ్యాణ్ రెడ్డి (96), రోహిత్ రెడ్డి (73), సాత్విక్ (55) అర్ధసెంచరీలు సాధించారు. తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంపీరియల్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులే చేయగల్గింది. మహేందర్ 27 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ శివకుమార్ (6/13) చెలరేగాడు. ఇంపీరియల్ కోల్పోయిన 8 వికెట్లలో 6 వికెట్లను అతనే పడగొట్టడం విశేషం. మిగతా రెండు వికెట్లను నిఖిల్ తీశాడు.

 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు

  స్వస్తిక్ యూనియన్: 66 (కరుణాకర్ 20; రోహన్ బోరంచ 8/16, బాలరాజు 1/15), టైమ్ సీసీ: 69/2 (సీతారామిరెడ్డి 46; రాహుల్ 1/14)

  ఎల్‌ఎన్‌సీసీ: 269/9 (యాసిన్ 76, రవూఫ్ 71; చైతన్యకృష్ణ 4/70, మహ్మద్ అలీ 3/54, శ్రీధర్‌రాజు 2/30), ఆజాద్: 97 (సందీప్ 57; యాసిన్ 5/30, తరుణ్ 4/32, సందీప్ 1/5)

  హెచ్‌యూసీసీ: 198 (ఆరిఫ్ 59, సయ్యద్ అహ్మద్ 46, అబ్దుల్ మొఖిత్ 34 నాటౌట్; సమీయుద్దీన్ 5/24, షేక్ నజీర్ 3/42), రుషిరాజ్: 162 (జీషాన్ 45; అబ్దుల్ మొఖిత్ 4/31, షణ్ముఖ్ 3/22)

  యాదవ్ డెయిరీ: 269/9 (సిద్ధార్థ 56, సాయిచరణ్ 39; దీపక్ 2/28, విజేందర్ 2/59), సాయి నాటౌట్ 48, రాజ్ 45; రిషబ్ 5/79, విష్ణు 2/31).





 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top