షకీబ్ ఆల్‌రౌండ్ షో

షకీబ్ ఆల్‌రౌండ్ షో


జింబాబ్వేపై బంగ్లాదేశ్ గెలుపు

 

 చిట్టగాంగ్:  ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 87 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఆటగాడు షకీబుల్ హసన్ (101 పరుగులు,4/41)  ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది.



షకీబ్‌కు తోడు రహీమ్ (65), రెహమాన్ (44 నాటౌట్)లు రాణించారు. పన్యంగర 3 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 42.1 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. బ్రెండన్ టేలర్ (54), మసకద్జ (42)లు ఫర్వాలేదనిపించారు. ఏడాది తర్వాత బంగ్లాదేశ్ వన్డే గెలవడం విశేషం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top