Alexa
YSR
‘ప్రతి పల్లెలోనూ అందరికీ గ్యాస్‌ సరఫరా, ప్రతి మహిళకూ ఆర్థిక భరోసా నా ధ్యేయం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం క్రీడలుకథ

టి20 గ్లోబల్‌ లీగ్‌లో జీఎంఆర్, షారుక్‌ జట్లు

Sakshi | Updated: June 20, 2017 00:20 (IST)
టి20 గ్లోబల్‌ లీగ్‌లో జీఎంఆర్, షారుక్‌ జట్లు

లండన్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల యజమానులుగా ఉన్న పారిశ్రామికవేత్త గ్రంధి మల్లికార్జున రావు (జీఎంఆర్‌), బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ ఇప్పుడు దక్షిణాఫ్రికా లీగ్‌పై కన్నేశారు. క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) ఆధ్వర్యంలో ఎనిమిది జట్ల మధ్య అక్టోబరు–నవంబరులో జరిగే టి20 గ్లోబల్‌ లీగ్‌లో వీరిద్దరూ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశారు.

 జొహన్నెస్‌బర్గ్‌ సిటీకి ప్రాతినిధ్యం వహించే జీఎంఆర్‌ జట్టులో పేసర్‌ రబడ స్టార్‌ ఆటగాడిగా ఉన్నాడు. ఇక కేప్‌టౌన్‌ ఆధారంగా ఉండే షారుక్‌ జట్టులో బ్యాట్స్‌మన్‌ డుమిని స్టార్‌ ఆటగాడు. డర్బన్, బెనోని, ప్రిటోరియా, స్టెలెన్‌బాష్, బ్లోమ్‌ఫోంటీన్, పోర్ట్‌ ఎలిజబెత్‌ ఈ లీగ్‌లోని మిగతా జట్లు. ఆగస్టు 19న ఆటగాళ్ల వేలం జరగనుండగా దీంట్లో అందుబాటులో ఉండేందుకు 10 దేశాల నుంచి 400 మంది ఆసక్తి చూపుతున్నారు.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

పట్టాలు తప్పిన ఉత్కళ్‌

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC