భారత్‌కు స్వల్ప ఆధిక్యం

భారత్‌కు స్వల్ప ఆధిక్యం


నాగ్‌పూర్‌: ఇంగ్లండ్‌తో జరుగుతోన్న అండర్‌–19 యూత్‌ టెస్టులో సౌరభ్‌సింగ్‌ (292 బంతుల్లో 109; 13 ఫోర్లు) సెంచరీ సాధించడంతో భారత్‌కు స్వల్ప ఆధిక్యం లభించింది. 153/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడోరోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌ 120.1 ఓవర్లలో 9 వికెట్లకు 388 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. దీంతో టీమిండియాకు 13 పరుగుల ఆధిక్యం లభించింది.


సౌరభ్‌ సింగ్‌ శతకానికి తోడు డారిల్‌ ఫెరారియో (77 బంతుల్లో 55; 7 ఫోర్లు), సిద్ధార్థ్‌ అక్రే (92 బంతుల్లో 54; 7 ఫోర్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆరోన్  బియర్డ్, ఇవాన్  వుడ్స్, లియయ్‌ పాటర్‌సన్ , మ్యాక్స్‌ హోల్డన్  తలా 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌ గురువారం ఆటముగిసే సమయానికి 9 ఓవర్లలో 2 వికెట్లను కోల్పోయి 34 పరుగులు చేసింది. డారిల్‌ ఫెరారియో, హర్‌‡్ష త్యాగి చెరో వికెట్‌ పడగొటా్టరు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top