సౌందర్యకు ప్రభుత్వ నజరానా

సౌందర్యకు ప్రభుత్వ నజరానా


రూ. 25 లక్షలు, ఇంటి స్థలం ప్రకటించిన సీఎం

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి యెండల సౌందర్యను రాష్ట్ర ప్రభుత్వం సముచిత రీతిలో సత్కరించింది. సౌందర్య సాధించిన ఘనతలను గుర్తిస్తూ ఆమెకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రూ. 25 లక్షల నగదు పురస్కారంతో పాటు ఇంటి స్థలాన్ని కూడా ప్రకటించారు. దీంతోపాటు ఇంటి నిర్మాణం కోసం సౌందర్యకు ప్రభుత్వమే మరో రూ. 15 లక్షలు కూడా ఇవ్వనుంది. తన తల్లిదండ్రులతో కలిసి ఆమె మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసింది. 25 ఏళ్ల సౌందర్య స్వస్థలం నిజామాబాద్. గత ఆరేళ్లలో ఆమె పలు సీనియర్, జూనియర్ అంతర్జాతీయ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. 2009 సీనియర్ ఆసియా కప్‌లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో రజత పతకాలు గెలుచుకున్న జట్టులో సౌందర్య సభ్యురాలు. మహిళల హాకీ ప్రపంచకప్‌లో కూడా ఈ క్రీడాకారిణి భారత్ తరఫున బరిలోకి దిగింది.



యెండల సౌందర్య, హాకీ క్రీడాకారిణి, కె. చంద్రశేఖరరావు

Yendal soundarya, hockey player, K. Chandra sekhara rao

 

 8

 సచిన్‌కు మరో గౌరవం

Another honor Tendulkar

 

 బ్రాడ్‌మన్ పురస్కారానికి ఎంపిక

 

 మెల్‌బోర్న్: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ పట్ల ఆస్ట్రేలియా క్రికెట్ మరోసారి తన అభిమానం చాటుకుంది. క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ ఫౌండేషన్ అందజేస్తున్న గౌరవ పురస్కారానికి సచిన్ ఎంపికయ్యాడు. సచిన్‌తోపాటు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వాను కూడా ఇందుకోసం ఎంపిక చేశారు. అతని బ్యాటింగ్ శైలి తన ఆటనే గుర్తుకు తెస్తోందని స్వయంగా బ్రాడ్‌మన్‌తోనే సచిన్ ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే. సిడ్నీలో అక్టోబర్ 29న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారంతో టెండూల్కర్‌ను సత్కరిస్తారు. ‘ఆటతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ ప్రత్యేకంగా గుర్తింపు పొందిన సచిన్, స్టీవ్ వాలు ఈ పురస్కారానికి అన్ని విధాలా అర్హులు’ అని బ్రాడ్‌మన్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రియా హోర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.





 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top