Alexa
YSR
‘జల ప్రాజెక్టులపై జనం ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ల నమ్మకం వమ్ము కాకుండా పనిచేయాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం క్రీడలుకథ

పాక్ కెప్టెన్ కు అరుదైన గౌరవం

Others | Updated: June 19, 2017 20:20 (IST)
పాక్ కెప్టెన్ కు అరుదైన గౌరవం

దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ను సాధించిన పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ కు అరుదైన గౌరవం లభించింది.  చాంపియన్స్ ట్రోఫీ ఐసీసీ  జట్టుకు సర్పరాజ్  కెప్టెన్ గా ఎంపికయ్యాడు.  ఐసీసీ నిర్వహించే ఒక మేజర్ టోర్నీ తర్వాత ఆటగాళ్లను ఇలా గౌరవించడం ఆనవాయితీ. ఈ మేరకు సోమవారం 12 మందితో కూడిన చాంపియన్స్ ట్రోఫీ జట్టును ఐసీసీ ప్రకటించింది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడిన ఇరు జట్లలో ఏడుగురికి చోటు దక్కడం ఇక్కడ విశేషం. ఇందులో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు శిఖర్ ధావన్ , భువనేశ్వర్ కుమార్ కూడా చోటు కల్పించారు. ఓపెనర్లుగా పాకిస్తాన్ ఆటగాడు ఫకార్ జమాన్-శిఖర్ ధావన్ లను ఎంపిక చేయగా, బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ కు టాపార్డర్ లో చోటు దక్కింది. మరొకవైపు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు 12వ ఆటగాడికి చోటు కల్పించారు.

చాంపియన్స్ ట్రోఫీ ఐసీసీ జట్టు ఇదే (బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం)

శిఖర్ ధావన్(భారత్)
ఫకార్ జమాన్(పాకిస్తాన్)
తమీమ్ ఇక్బాల్(బంగ్లాదేశ్)
విరాట్ కోహ్లి(భారత్)
జో రూట్(ఇంగ్లండ్)
బెన్ స్టోక్స్(ఇంగ్లండ్)
సర్ఫరాజ్ అహ్మద్(పాకిస్తాన్)
అదిల్ రషిద్(ఇంగ్లండ్)
జునైద్ ఖాన్(పాకిస్తాన్)
భువనేశ్వర్ కుమార్(భారత్)
హసన్ అలీ(పాకిస్తాన్)
కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

అమలు చేసేదెట్లా?

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC