సాకేత్ సంచలనం

సాకేత్ సంచలనం


యూఎస్ ఓపెన్ మెరుున్ ‘డ్రా’కు అర్హత 


న్యూయార్క్: పట్టుదలతో పోరాడిన తెలుగు టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని అనుకున్నది సాధించాడు. తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో మెరుున్ ‘డ్రా’కు అర్హత పొందాడు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో సాకేత్ పురుషుల సింగిల్స్ విభాగం మెరుున్ ‘డ్రా’కు అర్హత సాధించాడు.


వైజాగ్‌కు చెందిన 28 ఏళ్ల సాకేత్... భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన క్వాలిఫరుుంగ్ మూడో రౌండ్ మ్యాచ్‌లో 6-3, 6-0తో పెద్జా క్రిస్టిన్ (సెర్బియా)పై గెలుపొందాడు.  భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా ఉన్న సాకేత్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ క్వాలిఫరుుంగ్ టోర్నమెంట్‌లలో ఆడినప్పటికీ మెరుున్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. సోమవారం మొదలయ్యే యూఎస్ ఓపెన్ ప్రధాన టోర్నీ మెరుున్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 48వ ర్యాంకర్ జిరీ వెసెలీ (చెక్ రిపబ్లిక్)తో సాకేత్ ఆడతాడు.


 యూకీ బాంబ్రీ, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ తర్వాత ఇటీవల కాలంలో గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ విభాగంలో పోటీపడనున్న మూడో భారతీయ క్రీడాకారుడిగా సాకేత్ నిలిచాడు. గతంలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి సయ్యద్ మొహమ్మద్ హాది, సయ్యద్ ఆసిఫ్ ఖాద్రీ, గౌస్ మొహమ్మద్, ఎస్‌పీ మిశ్రా (హైదరాబాద్) గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో పాల్గొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top