సాయిప్రణీత్ పరాజయం

సాయిప్రణీత్ పరాజయం


ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్  




పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్నీ పురుషుల విభాగంలో భారత ఆటగాడు సారుుప్రణీత్ పోరాడి ఓడాడు. కొరియాకు చెందిన లీ హ్యూన్ 15-21, 21-8, 21-19 స్కోరుతో ప్రణీత్‌ను ఓడించాడు. 58 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ తొలి గేమ్‌లో సారుు ప్రణీత్ ఒక దశలో 3-5, 6-9తో వెనుకబడినా కూడా ఆ తర్వాత దూకుడుగా ఆడి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.



అరుుతే కోలుకున్న లీ రెండో గేమ్‌ను ఏకపక్షంగా ముగించాడు. అనంతరం మూడో గేమ్ హోరాహోరీగా సాగడంతో ఒక దశలో స్కోరు 19-19తో సమంగా నిలిచింది. అరుుతే ఒత్తిడిని అధిగమించి కొరియా ఆటగాడు వరుసగా రెండు పారుుంట్లు సాధించి మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. 


 

whatsapp channel

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top