సహేంద్రకు ఐదు వికెట్లు

సహేంద్రకు ఐదు వికెట్లు


ఎ-3 డివిజన్ రెండు రోజుల లీగ్

 సాక్షి, హైదరాబాద్: ఏ-3 డివిజన్ రెండు రోజుల లీగ్ చాంపియన్‌షిప్‌లో ఆక్స్‌ఫర్డ్ బ్లూస్, క్లాసిక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ జట్టు 54 ఓవర్లలో 160 పరుగులు చేసి ఆలౌటైంది. బ్యాటింగ్‌లో డేవిడ్ శామ్యూల్స్ (30 బంతుల్లో 28; 4 ఫోర్లు), సహేంద్ర (70 బంతుల్లో 28; 2 ఫోర్లు) రాణించారు.  



అనంతరం బ్యాటింగ్‌కు దిగిన క్లాసిక్ జట్టును ఆక్స్‌ఫర్డ్ బౌలర్లు సమర్థంగా నియంత్రించారు. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో క్లాసిక్ జట్టు 30.4 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. సహేంద్ర 5 వికెట్లతో రెచ్చిపోయాడు. మరో బౌలర్ వెంకట్ కిరణ్ 4 వికెట్లు పడగొట్టాడు.

 

ఇతర మ్యాచ్‌ల వివరాలు

 పూల్ ఏ

  మాంచెస్టర్: తొలి ఇన్నింగ్స్ 461/6 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్ 6/2 డిక్లేర్డ్; డెక్కన్ బ్లూస్ తొలి ఇన్నింగ్స్: 182/10 (హర్ష వర్థన్ సింగ్ 72, హర్ష వర్థన్ 48; ఖయ్యూమ్ 4/23, జగదీశ్ నాయుడు 3/44); రెండో ఇన్నింగ్స్: 46/4 (19 ఓవర్లలో ) మ్యాచ్ డ్రా.

 

 మహమూద్ సీసీ: తొలి ఇన్నింగ్స్ 205/10, రెండో ఇన్నింగ్స్ 175/1; నిజామ్ కాలేజ్: తొలి ఇన్నింగ్స్ 221/10 (శరత్ 46, అక్షయ్ 33, అన్వేష్ రెడ్డి 64; శ్రీనాథ్ రెడ్డి 3/ 38, సచిన్ శర్మ 3/ 49) మ్యాచ్ డ్రా.

 

 నేషనల్: తొలి ఇన్నింగ్స్ 107/9 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్ 63/10 (సాయి 7/17); గ్రీన్ టర్ఫ్: తొలి ఇన్నింగ్స్ 99/10, రెండో ఇన్నింగ్స్ 73/2 (సయ్యద్ షబాజుద్దీన్ 30);



 స్పోర్టివ్: తొలి ఇన్నింగ్స్ 102/9 డిక్లేర్డ్ ( గోపి కృష్ణ రెడ్డి 39; సాయి కృష్ణ 3/15, హరిబాబు 3/29, విన్సెంట్ కుమార్ 3/ 42); ఎస్‌బీఐ: 252/9 డిక్లేర్డ్ ( రంగనాథ్ 129, మొహమ్మద్ ఆసిఫ్ 3/53, సంజయ్ 3/53), రెండో ఇన్నింగ్స్ 34/4;

 

అగర్వాల్: తొలి ఇన్నింగ్స్ 303/10, రెండో ఇన్నింగ్స్ 151/9 డిక్లేర్డ్ (మహేశ్ 31, సాయి 38, మొహమ్మద్ అబిద్ 4/37); బాలాజీ క్లాట్స్: 208/10 (మొహమ్మద్ ఫయాజ్ 38, విజయ్ 54; సయ్యద్ ఇర్షద్ పాషా 4/39);

 పూల్ బి

 

హైదరాబాద్ టైటాన్స్: 111/9 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్ 65/5 (రవూఫ్ 31); తెలంగాణ 325/9 డిక్లేర్డ్ (రాకేశ్ నాయక్ 209, యశ్ గుప్తా 36);

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top