ఫస్ట్ హిట్ వికెట్

ఫస్ట్ హిట్ వికెట్


నెల్సన్: యూఏఈతో జరుగుతున్న మ్యాచ్ లో జింబాబ్వే బ్యాట్స్ మన్ రిగిస్ చకాబ్వాను దురదృష్టం వెంటాడింది. జాగ్రత్తగా ఆడినప్పటికీ 'హిట్ వికెట్'గా అవుటయ్యాడు. ఓపెనర్ గా వచ్చిన చకాబ్వా ఆరంభం నుంచి ఆచితూచి ఆడాడు. 22 ఓవర్ తొలి బంతికి అతడు దురదృష్టకర రీతిలో అవుటయ్యాడు.



యూఏఈ కెప్టెన్ మహ్మద్ తాఖీర్ వేసిన బంతిని లెగ్ సైడ్ ఆడాడు. ఈ క్రమంలో వెనక్కి మడిచిన అతడి బ్యాక్ ఫుట్ వికెట్లను తాకడంతో బెయిల్స్ కింద పడ్డాయి. అంపైర్ అవుట్ హిట్ వికెట్ గా ప్రకటించడంతో అతడు నిరాశగా మైదానం వీడాడు. ఈ ప్రపంచకప్ లో  హిట్ వికెట్ గా అవుటైన క్రికెటర్ చకాబ్వా కావడం విశేషం. చకాబ్వా 62 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేశాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top