నన్ను క్రికెట్ కెప్టెన్గా చేసినా..

నన్ను క్రికెట్ కెప్టెన్గా చేసినా..


ముంబై:భారత్తో  జరిగే టెస్టు సిరీస్ తరువాత ఇంగ్లండ్ కెప్టెన్ బాధ్యతల నుంచి అలెస్టర్ కుక్ తప్పుకుంటాడంటూ వస్తున్న రూమర్లను సహచర ఆటగాడు జో రూట్ ఖండించాడు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని తాజాగా స్పష్టం చేశాడు. ఇంకా చాలాకాలం వరకూ కుక్ తమ సారథిగా ఉంటాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఇంగ్లండ్ జట్టులో కుక్కు ప్రత్యేక స్థానం ఉందనే విషయాన్ని గ్రహించాలని హితవు పలికాడు.తమ జట్టు కెప్టెన్గా కొనసాగే అన్ని అర్హతలూ అతనొక్కడికే సొంతమని ప్రశంసల వర్షం కురిపించాడు.



'అతనొక అద్భుతమైన నాయకుడు. అతని సారథ్యంలో ఆడటాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తాను. మీరేమో కుక్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు నాకు ఇస్తాన్నారంటూ రూమర్లు పుట్టిస్తున్నారు. నన్ను బలవంతంగా మీరు కెప్టెన్ ను చేసినా, కుక్ కు వచ్చే ఇబ్బందేమీ లేదు. నాయకుడు అనే అదనపు భారం అతనిపై తగ్గి మరింత స్వేచ్ఛగా ఆడే వీలును కుక్కు కల్పించిన వారవుతారు' అని రూట్ చమత్కరించాడు.



తాను ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్ కావడానికి చాలా సమయం ఉన్నదనే వాస్తవాన్ని గ్రహించాలన్నాడు. ప్రస్తుత తన బాధ్యతతో చాలా సంతృప్తిగా ఉన్నానని రూట్ తెలిపాడు. నిజాయితీగా చెప్పాలంటే తమకు సరైన నాయకుడు కుక్ అంటూ పొగడ్తలు కురిపించాడు. అనవసరంగా కుక్ ప్రతిభను తక్కువ చేసి చూపొద్దంటూ మీడియాకు సూచించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top