'ఆయనే నా హీరో'
లండన్ : డంకన్ ఫెర్గ్యూసన్ తన హీరో అని, ఆయనే తనకు ఆదర్శమని ఇంగ్లండ్ ఫుట్బాల్ టీమ్ కెప్టెన్ వేన్ రూనీ తెలిపాడు. మాంచెస్టర్ యునైటెడ్ స్ట్రయికర్ రూనీ 11 ఏళ్ల తర్వాత ఎవర్టన్ జట్టు తరఫున ఆడనున్నట్లు ప్రకటించాడు. వచ్చే ఆగస్ట్ 2 న స్పానిష్ జట్టుతో తలపడుతున్న ఎవర్టన్ జట్టులో సభ్యుడిగా కొనసాగనున్నాడు. తనకు 16 ఏళ్లున్నప్పుడు ఎవర్టన్ జట్టులో ఉండేవాడినని, ఆ సమయంలో ఫెర్గ్యూసన్ తనకు ఎంతో సహకరించారని పేర్కొన్నాడు. తనను మంచి ఆటగాడిగా తీర్చిదిద్దాడని, ఆయనే తన హీరో అంటూ వ్యాఖ్యానించాడు.
మాంచెస్టర్ యునైటెడ్ స్ట్రయికర్ రూనీ మరిన్ని విషయాలను గోల్.కామ్ అనే వెబ్సైట్లో పంచుకున్నాడు. డంకన్ తనను ఈ మ్యాచ్ విషయమై సంప్రదించకున్నప్పటికీ, ఆయనపై ఉన్న అభిమానంతోనే ఈ మ్యాచ్ ఆడుతున్నట్లు వివరించాడు. ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఆటగాళ్లో రూనీ ఒకడన్న విషయం తెలిసిందే.