ఫెడరర్ x వావ్రింకా

ఫెడరర్  x వావ్రింకా


మోంటెకార్లో: స్విట్జర్లాండ్ స్టార్ క్రీడాకారులు రోజర్ ఫెడరర్, స్టానిస్లాస్ వావ్రింకా  ఈ సీజన్‌లో తమ నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తూ మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీలో టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఫెడరర్ 7-5, 6-2తో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించగా... వావ్రింకా 6-1, 7-6 (7/3)తో డేవిడ్ ఫెరర్ (స్పెయిన్)పై గెలిచాడు. క్వార్టర్స్‌లో టాప్ సీడ్ నాదల్‌ను ఓడించిన ఫెరర్ అదే జోరును కనబర్చలేకపోయాడు. వావ్రింకాతో ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 13-1తో ఆధిక్యంలో ఉన్నాడు.

 

 గతంలో మూడుసార్లు ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న ఫెడరర్ మూడుసార్లూ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. ఫెడరర్ నెగ్గితే కెరీర్‌లో 79వ టైటిల్‌తో అత్యధిక టైటిల్స్ నెగ్గిన వారి జాబితాలో మూడో స్థానానికి చేరుకుంటాడు. వావ్రింకా గెలిస్తే అతని కెరీర్‌లో తొలి మాస్టర్స్ సిరీస్ టైటిల్ అవుతుంది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top