24 గంటలు.. రెండు వేల ఓవర్లు!

24 గంటలు.. రెండు వేల ఓవర్లు!


లీడ్స్: రోడ్లీ క్రికెట్ క్లబ్ సరికొత్త వరల్డ్ రికార్డును నెలకొల్సింది. అక్కడ శిక్షణ పొందుతున్న జూనియర్ స్థాయి ఆటగాళ్లు 24 గంటల్లో రెండు వేల ఓవర్లు బౌలింగ్ వేసి కొత్త అధ్యాయాన్ని లిఖించారు. గిన్నిస్ రికార్డు కోసం అధికారికంగా దరఖాస్తు చేసుకున్న రోడ్లీ క్రికెట్ క్లబ్ జట్టు.. ఆ మేరకు రెండు వేల ఓవర్ల పాటు బౌలింగ్ చేసి వరల్డ్ రికార్డు సాధించింది. ఈ క్లబ్ కు చెందిన ఆటగాళ్లు ఒకవైపు బ్యాటింగ్ చేస్తుండగా, మరొకవైపు పలువురు నిరంతరాయంగా బౌలింగ్ చేశారు. గతంలో ఎనిమిది గంటలు పాటు బౌలింగ్ చేసి 734 ఓవర్లు వేసిన రోడ్లీ క్లబ్.. ఈసారి రోజంతా బౌలింగ్ చేసి సరికొత్త రికార్డును లిఖించింది.



రెండు వేల ఓవర్ల ఘనతను సాధించినందుకు రోడ్లీ క్లబ్ ఆటగాడు మిస్టర్ రిడిల్ సంతోషం వ్యక్తం చేశాడు. రెండు వేల ఓవర్ ను వేసే అవకాశం తనకు దక్కినందుకు గర్వంగా ఉందన్నాడు. రికార్డు సాధించే క్రమంలో తమ క్లబ్ ఆటగాళ్లు బాగా అలసిపోయినా దాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామన్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top