తొమ్మిది నిమిషాలు.. ఐదు గోల్స్!

తొమ్మిది నిమిషాలు.. ఐదు గోల్స్! - Sakshi


బెర్లిన్: ఆటల్లో సంచలనాలకు కొదవ ఉండదు. గేమ్ ఏదైనా కావొచ్చు.. ఆటలో మజా ఉంటే చాలు. ఆటగాడు ఎవరైనా కావొచ్చు.. నైపుణ్యం ముఖ్యం. అలా అసాధారణ రీతిలో చెలరేగిపోయిన ఓ అనామక ఫుట్ బాల్ ఆటగాడు ఏకంగా ఐదు గోల్స్ చేసి తన జట్టుకు చారిత్మాత్మక గెలుపును అందించిన ఘటన జర్మనీ ఫుట్ బాల్ లీగ్ లో చోటు చేసుకుంది.  గత రెండు రోజుల క్రితం బేయోరన్ మునిచ్-వాల్ఫ్ బర్గ్ ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే తొలి అర్థం ముగిసే సరికి బేయోరన్ మునిచ్ జట్టు 1-0 తేడాతో వెనుకబడింది. ఆ సమయంలో మునిచ్ జట్టు తరపున రాబర్ట్ లీవాందోవ్ స్కీ  సబ్ స్టిట్యూట్ గా రింగ్ లో కి వచ్చాడు.


 


మరి వచ్చిన సమయం ఏమో కానీ.. వచ్చీ రావటంతోనే రెచ్చి పోయాడు. వరుసగా గోల్స్ వేసుకుంటూ పోయాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు అడ్డుకుందామనే లోపులే చెయ్యాల్సిన పని చేసేశాడు. కేవలం తొమ్మిది నిమిషాల్లో ఐదు గోల్స్ నమోదు చేశాడు. ఇంకే ముంది మునిచ్ జట్టు 5-1 తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. తొలి మూడు గోల్స్ ను నాలుగు నిమిషాల్లో వేసి హ్యాట్రిక్ ను నమోదు చేయడంతో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. దీంతో పాటు అతి తక్కువ సమయంలో ఐదు గోల్స్ ను నమోదు చేసి జర్మనీ ఫుట్ లీగ్ చరిత్రలో  కొత్త రికార్డును నెలకొల్పాడు.


రాబర్ట్ లీవాందోవ్ స్కీ మరిన్ని రికార్డులు..


*జర్మనీ ఫుట్ బాల్ లీగ్ లో ఐదు గోల్స్ చేసిన 14 వ ఆటగాడిగా గుర్తింపు


*1991లో జర్మనీ తరపున మైఖేల్ టోన్నిస్ నెలకొల్పిన ఐదు గోల్స్ రికార్డు సమం


*1984 తరువాత బేయోరన్ మునిచ్ తరపున ఐదు గోల్స్ చేసిన ఏకైక ఆటగాడిగా అరుదైన ఘనత


* సబ్ స్టిట్యూట్ గా బరిలోకి దిగి ఐదు గోల్స్ చేసిన ఏకైక జర్మనీ ఆటగాడు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top