రికియార్డోకు తొలి పోల్

రికియార్డోకు తొలి పోల్


నేటి ప్రధాన రేసు

సాయంత్రం గం. 5.25 నుంచి

స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం

►  నేడు మొనాకో గ్రాండ్‌ప్రి


 

 

మోంటెకార్లో: నికో రోస్‌బర్గ్, లూయిస్ హామిల్టన్ కాకుండా ప్రస్తుత ఫార్ములావన్ సీజన్‌లో తొలిసారి మరో జట్టు డ్రైవర్‌కు పోల్ పొజిషన్ లభించింది. శనివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో రెడ్‌బుల్ జట్టుకు చెందిన డానియల్ రికియార్డో తన కెరీర్‌లో తొలిసారి పోల్ పొజిషన్ సాధించాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ డ్రైవర్ క్వాలిఫయింగ్‌లో అందరికంటే వేగంగా ఒక నిమిషం 13.622 సెకన్లలో ల్యాప్‌ను ముగించి అగ్రస్థానాన్ని పొందాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి మొదలుపెట్టే అవకాశాన్ని సంపాదించాడు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు రోస్‌బర్గ్, హామిల్టన్ వరుసగా రెండు, మూడు స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు నికో హుల్కెన్‌బర్గ్ ఐదో స్థానం నుంచి... సెర్గియో పెరెజ్ ఎనిమిదో స్థానం నుంచి రేసును ప్రారంభిస్తారు. ఈ సీజన్‌లో ఐదు రేసులు ముగిశాక రోస్‌బర్గ్ 100 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.





గ్రిడ్ పొజిషన్స్: 1. రికియార్డో (రెడ్‌బుల్), 2. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 3. హామిల్టన్ (మెర్సిడెస్), 4. వెటెల్ (ఫెరారీ), 5. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 6. రైకోనెన్ (ఫెరారీ), 7. కార్లోస్ సెయింజ్ (ఎస్టీఆర్), 8. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 9. క్వియాట్ (ఎస్టీఆర్), 10. అలోన్సో (మెక్‌లారెన్), 11. బొటాస్ (విలియమ్స్), 12. గుటిరెజ్ (హాస్), 13. బటన్ (మెక్‌లారెన్), 14. మసా (విలియమ్స్), 15. గ్రోస్యెన్ (హాస్), 16. మాగ్నుసెన్ (రెనౌ), 17. ఎరిక్సన్ (సాబెర్), 18. పాల్మెర్ (రెనౌ), 19. హర్యాంతో (మనోర్), 20. వెర్లీన్ (మనోర్), 21. వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), 22. నాసర్ (సాబెర్).

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top