గేల్ విజృంభణ; బెంగళూరు ఘన విజయం

గేల్ విజృంభణ; బెంగళూరు ఘన విజయం


ఢిల్లీ: డేర్ డెవిల్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని రాయల్ చాలెంజర్స్ ఊది పడేసింది. గేల్ దుమారంతో 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. బౌలర్లు ఢిల్లీని స్వల్ప స్కోరుకే కట్టిచేస్తే, గేల్ సునామీ ఇన్నింగ్స్ తో డేర్ డెవిల్స్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. గేల్ విజృంభణతో 57 బంతులు మిగులుండగానే విజయాన్ని అందుకుంది.



ఆదివారం రాత్రి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీని కోహ్లి సేన చిత్తుగా ఓడించింది. ఢిల్లీ తన ముందు ఉంచిన 96 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 10.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా సునాయాసంగా ఛేదించింది. గేల్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. కెప్టెన్ కోహ్లి 23 బంతుల్లో 6 ఫోర్లతో 35 పరుగులు సాధించాడు.



టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ 18.2 ఓవర్లలో 95 పరుగులకు ఆలౌటైంది. బెంగళూరు బౌలర్ల ధాటికి ఢిల్లీ స్వల్ప స్కోరుకే చాప చుట్టేసింది. జాదవ్(33), అగర్వాల్(27), డుమిని(13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. యువరాజ్ సింగ్(2) మరోసారి విఫలమయ్యాడు. మాథ్యూస్, అయ్యర్ డకౌటయ్యారు. బెంగళూరు బౌలర్లలో స్టార్క్ 3, ఆరోన్ 2, వీసె 2 వికెట్లు పడగొట్టారు. పటేల్, ఇక్బాల్ అబ్దుల్లా చెరో వికెట్ తీశారు.  యువరాస్, మాథ్యూస్ వికెట్లు పడగొట్టిన వరుణ్ ఆరోన్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top