గెలిపించాడు..గెలిచాడు!

గెలిపించాడు..గెలిచాడు!


ధర్మశాల: ఆస్ట్రేలియాతో తాజాగా జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా సాధించడంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పాత్ర వెలకట్టలేనిది. టీమిండియా సిరీస్ విజయంలో ఆటగాళ్ల సమష్టి కృషి కారణమైనప్పటికీ, జడేజా గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించక తప్పదు. పుణెలో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోయినప్పటికీ తిరిగి పుంజుకుని సిరీస్ ను 2-1తో దక్కించుకోవడంలో జడేజా ముఖ్య భూమిక పోషించాడనేది కాదనలేని వాస్తవం. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కల్గిన ఆస్ట్టేలియాకు ముచ్చెమటలు పట్టించాడు జడేజా.



ఒకవైపు భారత ప్రధాన స్పిన్నన్ అశ్విన్ వికెట్ల వేటలో వెనకబడితే జడేజా మాత్రం విశేషంగా రాణించాడు. ఈ సిరీస్లో 25 వికెట్లు తీసి భారత్ సిరిస్ ను సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. నాల్గో టెస్టులో మొత్తంగా నాలుగు వికెట్లను తన ఖాతాలో  వేసుకున్న జడేజా.. భారత్ ఓటమి పాలైన తొలి టెస్టులో సైతం ఐదు వికెట్లను సాధించడం ఇక్కడ విశేషం. ఇక బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో జడేజా విశ్వరూపం ప్రదర్శించాడు.


ఆ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు సాధించి ఆసీస్ నడ్డివిరిచిన జడేజా..రెండో ఇన్నింగ్స్ లో వికెట్ తీశాడు. రాంచీలో డ్రాగా ముగిసిన మూడో టెస్టులో జడేజా మొత్తం 9 వికెట్లు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు.. మరొకవైపు బ్యాటింగ్ లో కూడా జడేజా తన పాత్రను బాగానే నిర్వర్తించాడని చెప్పాలి. ఈ సిరీస్ ఆరంభంలో బ్యాటింగ్ లో కొద్దిగా తడబడిన జడేజా.. చివరికొచ్చేసరికి తనదైన మార్కును చూపట్టాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన జడేజా.. ఆఖరి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో కూడా హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో అర్ధ శతకం చేసి ఆధిక్యంలో నిలిపాడు. ఇలా సిరీస్ ను గెలవడంలో తన పాత్రను సమర్ధవంతంగా పోషించిన జడేజా.. అటు చివరి టెస్టు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులను సొంతం చేసుకుని భళా అనిపించాడు.


dddddddddd

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top