ఆ విమర్శల్లో అర్థం లేదు: రవిశాస్త్రి

ఆ విమర్శల్లో అర్థం లేదు: రవిశాస్త్రి


న్యూఢిల్లీ:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్ కు టర్నింగ్ ట్రాక్ లను  రూపొందించి ఎటువంటి మజా లేకుండా చేశారని వస్తున్న విమర్శలను టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి తిప్పికొట్టాడు. ఆ విమర్శల్లో ఎటువంటి అర్థం లేదని తనదైన శైలిలో జవాబిచ్చాడు. డిసెంబర్ 3వ తేదీ నుంచి ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగే తదుపరి టెస్టుకు కూడా స్పిన్ ట్రాక్ నే సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. మరోసారి తమ స్పిన్ ను ఎదుర్కొనేందుకు ప్రపంచ నంబర్‌వన్  దక్షిణాఫ్రికా జట్టు సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు.


 


మూడు రోజుల్లోనే టెస్టు మ్యాచ్ లు ముగిసేలా పిచ్ లు తయారు చేయడంలో తప్పేమిటని రవిశాస్త్రి ప్రశ్నించాడు.  ఇటీవల ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ల మధ్య  పెర్త్ లో జరిగిన రెండో టెస్టు తరహా పిచ్ ను రూపొందించాల్సిదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆ టెస్టులో బ్యాటింగ్ ట్రాక్ రూపొందించడంతోనే భారీ పరుగుల వర్షం కురిసిందన్నాడు. దాదాపు ఇరుజట్లు 1,672 పరుగులు నమోదు చేసినా జట్టు ఎటువంటి ఫలితం లేకుండా ముగిసిన విషయం విమర్శకులు గుర్తించుకుంటే మంచిదన్నాడు. క్రికెట్ విశ్లేషకుల నుంచి ఎటువంటి విమర్శలు వచ్చినా పట్టించుకోమని.. ఆఖరి టెస్టు కూడా స్పిన్ ట్రాక్ నే సిద్ధం చేస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఆ మ్యాచ్ లో విజయం సాధించి టెస్టు సిరీస్ ను సంపూర్ణంగా ముగిస్తామనే నమ్మకం ఉందన్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top