పార్థివ్ పటేల్ సెంచరీ

పార్థివ్ పటేల్ సెంచరీ


 సాక్షి, విజయనగరం: టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్ (176 బంతుల్లో 122; 18 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో గురువారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూప్-బి మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోరు సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 81 ఓవర్లలో 5 వికెట్లకు 250 పరుగులు చేసింది. రుజుల్ భట్ (27 బ్యాటింగ్), నీరజ్ పటేల్ (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. స్వల్ప విరామాల్లో గోయెల్ (4). పాంచల్ (8), భార్గవ్ (19)లు అవుట్‌కావడంతో గుజరాత్ 69 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిం ది. ఈ దశలో పార్థివ్... వేణుగోపాల్ రావు (39)తో కలిసి నాలుగో వికెట్‌కు 105 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. విజయ్ కుమార్ 3 వికెట్లు తీశాడు.

 

 కేరళ 186/5

 సాక్షి, హైదరాబాద్: కీలక సమయంలో వికెట్లు తీసిన హైదరాబాద్ బౌలర్లు గురువారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూప్-సి మ్యాచ్‌లో కేరళను కట్టడి చేశారు. రోహన్ ప్రేమ్ (245 బంతుల్లో 106 బ్యాటింగ్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగినా మిగతా బ్యాట్స్‌మన్ నిరాశపర్చడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 92 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. ప్రేమ్‌తో పాటు గోమెజ్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. జగదీశ్ (42) మెరుగ్గా ఆడాడు.  విశాల్ శర్మ, ఆకాశ్ బండారీ చెరో రెండు వికెట్లు తీశారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top