నా ఎదుగుదలకు ద్రవిడ్ కారణం

నా ఎదుగుదలకు ద్రవిడ్ కారణం


గోల్ఫర్ చిక్కరనగప్ప

కోల్‌కతా: భారత క్రికెట్ జట్టుకు ‘ది వాల్’గా సేవలందించిన మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు ఇతర క్రీడల ఆటగాళ్లకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాడు. గోల్ఫర్ ఎస్.చిక్కరనగప్ప ఇందులో ఒకడు. ద్రవిడ్ మార్గదర్శకత్వంలో 21 ఏళ్ల ఈ యవ గోల్ఫర్ అంతర్జాతీయ స్థాయిలో తొలిసారిగా ఆసియా డెవలప్‌మెంట్ టూర్ గెలుచుకున్నాడు. దీంతో 2014 పీజీటీఐ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌పై కన్నేశాడు.

 



‘ద్రవిడ్ మెంటర్‌గా సేవలందించడంతో కల నిజమైనట్టుంది. గత ఆరు నెలల నుంచి ఆయనతో కలిసి పనిచేస్తున్నాను. భారత గోల్ఫ్ రంగంలో నా ఎదుగుదలకు ద్రవిడ్ కారణం. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతూ గతాన్ని మర్చిపో అని సూచించారు’ అని గో స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న చిక్కరనగప్ప తెలిపాడు. ఈ ఫౌండేషన్‌కు ద్రవిడ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top