వీళ్లు మామూలోళ్లు కాదు!

వీళ్లు మామూలోళ్లు కాదు!


'కొందరు కొడితే ఎక్స్ రేలో కనపడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్లో కనపడుతుంది, అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది'- ఓ తెలుగు సినిమాలోని డైలాగ్ ఇది. క్రికెట్ లో బ్యాట్ తో చెలరేగిపోయే విధ్వంసకారులకు ఈ డైలాగ్ అతికినట్టు సరిపోతుంది. వాళ్లు బాదడడం మొదలు పెడితే రికార్డులు బద్దలు కావాల్సిందే. విజయాలు తన్నుకుంటే రావాల్సిందే. బ్యాట్ ఝుళిపించారంటే పరుగుల జడివాన కురవాల్సిందే.



తాజా వరల్డ్ కప్ లో హిట్టర్లు చెలరేగుతున్నారు. బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్, దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్, వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ విధ్వంసకర బ్యాటింగ్ తో మ్యాచ్ గతిని మార్చేస్తున్నారు. ఆట ఆరంభం నుంచే బౌలర్లపై విరుచుకుపడడం వీరి ప్రత్యేకత. సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వరద పారించడం వీరికి ఇష్టం. తమదైన రోజున వీరిని ఆపడం ఎవరి తరం కాదు.



జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో గేల్ విశ్వరూపం చూపించాడు. 147 బంతుల్లోనే 10 ఫోర్లు, 16 సిక్సర్లతో 215 పరుగులతో రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచుల్లో కివీస్ కెప్టెన్ మెక్ కల్లమ్ అర్థసెంచరీలతో విజృంభించాడు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో అజేయ శకతంతో సఫారీ కెప్టెన్ డివిలియర్ చెలరేగాడు. 66 బంతుల్లో 17 ఫోర్లు,  8 సిక్సర్లతో 162 పరుగులు సాధించాడు. దీంతో మూడు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.



దక్షిణాఫ్రికా ఆటగాడు మిల్లర్, టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, ధావన్, రైనా, ధోని, ఆసీస్ ప్లేయర్స్ మ్యాక్స్ వెల్, వార్నర్ కూడా హిట్టర్ల జాబితాలో ఉన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top