పాక్ పర్యటన సురక్షితం కాదు: ఫికా


మెల్‌బోర్న్: పాకిస్తాన్‌లో విదేశీ క్రికెట్ జట్లు పర్యటించడం ఇప్పటికీ అంత సురక్షితం కాదని అంతర్జాతీయ క్రికెటర్ల సంఘం సమాఖ్య (ఫికా) వ్యాఖ్యానించింది. జింబాబ్వే జట్టు పాక్‌లో పర్యటించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ టూర్‌కు వెళ్లకపోవడమే మంచిదని భద్రతా నిపుణులు సలహా ఇచ్చారని చెప్పింది. ‘ఆటగాళ్ల భద్రత మాకు చాలా ముఖ్యం.



జింబాబ్వే జట్టు పర్యటనకు వెళ్లాలనుకుంటే మ్యాచ్ అధికారులను ఎవరినైనా పాక్‌కు పంపించి పరిస్థితులను సమీక్షిస్తే బాగుండేది. ఈ టూర్‌లో రిస్క్ ఎక్కువగా ఉందని ఫికా భద్రతా అధికారులు మాకు తెలిపారు. కాబట్టి ఇలాంటి సమయంలో అక్కడ పర్యటించడం అంత ఆమోదయోగ్యం కాదు’ అని ఫికా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టోనీ ఐరిష్ అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top