స్టెయిన్ అద్భుత క్యాచ్
ఆక్లాండ్: ప్రపంచకప్ లో భాగంగా గ్రూపు-బీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ 30 పరుగులు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ షెహజాద్ 18 పరుగులు చేసి అబాట్ బౌలింగ్ లో అవుటయ్యాడు. స్టెయిన్ పట్టిన అద్భుత క్యాచ్ తో షెహజాద్ పెవిలియన్ చేరాడు.
షెహజాద్ బంతిని గాల్లోకి లేపగా స్టెయిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయి బోర్లాపడిపోయాడు. అయినా బంతిని వదలకుండా ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. దీంతో షెహజాద్ నిరాశగా మైదానాన్ని వీడాడు.