పాకిస్థాన్ చెత్త రికార్డు
క్రైస్ట్ చర్చి: వెస్టిండీస్‌తో ప్రపంచ కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ ఆరంభంలో ఒక్క పరుగుకే 4 వికెట్లు కోల్పోయింది. వన్డే క్రికెట్లో 4 వికెట్ల నష్టానికి ఇదే అత్యల్ప స్కోరు (1). 2006లో జింబాబ్వేతో మ్యాచ్‌లో కెనడా 4 వికెట్ల నష్టానికి 4 పరుగులు చేసింది. తాజాగా పాకిస్థాన్.. ఇంతకంటే చెత్తగా ఆడింది. దీంతో వన్డేల్లో 4 వికెట్ల నష్టానికి అతి తక్కువ స్కోరు చేసిన జట్టుగా పాక్ అప్రతిష్ట మూటగట్టుకుంది.
విండీస్ బౌలర్ జెరోమీ టేలర్ ఆరంభంలోనే పాక్‌ను చావు దెబ్బ తీశాడు. టేలర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే పాక్ రెండు వికెట్లు కోల్పోయింది. పాక్ పరుగుల ఖాతా తెరవకనే ఓపెనర్ నాజిర్ జంషెడ్ పెవిలియన్ చేరాడు. ఇదే ఓవర్లో యూనిస్ ఖాన్ కూడా అదే బాటపట్టాడు. టేలర్ తన మరుసటి ఓవర్లో హారిస్ సొహైల్‌ను అవుట్ చేశాడు. ఇక విండీస్ బౌలర్ హోల్డర్ ఆ తర్వాతి బంతికి హెహజాద్ను అవుట్ చేశాడు. దీంతో పాక్ ఒక్క పరుగుకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ నలుగురూ క్యాచ్ అవుటయ్యారు.