ఒలింపిక్ క్రీడా గ్రామం ప్రారంభం

ఒలింపిక్ క్రీడా గ్రామం ప్రారంభం


రియో డి జనీరో: బ్రెజిల్‌లో ఒలింపిక్స్ సందడి ప్రారంభమైంది. మరో రెండు వారాల్లో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ప్రారంభం కాబోతుండగా తాజాగా ఒలింపిక్స్ అథ్లెట్స్ గ్రామాన్ని అధికారికంగా తెరిచారు. అత్యంత అధునాతనంగా నిర్మించిన ఈ క్రీడా గ్రామం 10,500 మంది అథ్లెట్లు, 7 వేల మంది సిబ్బందికి వసతి కల్పించనుంది.



31 భవన సముదాయాలతో కూడిన ఈ గ్రామంలో టెన్నిస్ కోర్టులు, సాకర్ మైదానాలు, ఏడు స్విమ్మింగ్ పూల్స్, అధునాతన జిమ్‌తో పాటు సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇక భోజనశాలలో ప్రపంచంలోని ఏ వంటకమైనా అథ్లెట్లకు రుచి చూపించేందుకు సిద్ధం చేశారు. దీంట్లో రోజుకు 60 వేల భోజనాలను వడ్డించనున్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top