జడేజాపై వేటు.. కొత్త కుర్రాడు అరంగేట్రం

జడేజాపై వేటు.. కుల్దీప్ యాదవ్ అరంగేట్రం


పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే వివాదం ఇంకా పూర్తిగా సమసిపోక ముందే భారత క్రికెట్‌ జట్టు మరో సిరీస్‌కు సన్నద్ధమైంది. వెస్టిండీస్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు జరగనున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో ఓ కీలక మార్పు చోటుచేసుకుంది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు తుది జట్టులో చోటు దక్కలేదు. అతడి స్థానంలో జట్టులో చేరిన యువ బౌలర్ కుల్దీప్ జాదవ్ వన్డే అరంగేట్రం చేయనున్నాడు.


చైనామన్ బౌలర్‌గా విశిష్టత కలిగి ఉన్న కుల్దీప్ వైపే కెప్టెన్ కోహ్లీ మొగ్గుచూపడంతో జడేజాకు నిరాశే ఎదురైంది. తొలుత అశ్విన్ స్థానంలో కుల్దీప్‌ను తీసుకుంటారని అందరూ భావించగా.. చివరి నిమిషంలో జడేజా బదులుగా కొత్త కుర్రాడికి అవకాశం ఇచ్చారు. మరోవైపు సరిగ్గా ఏడాది క్రితం భాతర జట్టు నూతన కోచ్‌గా అనిల్‌ కుంబ్లే తన బాధ్యతలను వెస్టిండీస్‌ పర్యటన నుంచే ఆరంభించగా.. కోహ్లీతో వివాదం కారణంగా కోచ్ పదవికి ఇటీవల రాజీనామా చేశాడు.



జట్లు:

భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, అజింక్యా రహానే, యువరాజ్, ధోనీ, కేదార్ జాదవ్, హార్యిక్ పాండ్యా, అశ్విన్‌, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్‌.

విండీస్‌: హోల్డర్‌ (కెప్టెన్‌), లూయిస్, మొహమ్మద్, రోస్టన్ చేజ్, జేఎల్ కార్టర్, పావెల్, హోప్, నర్స్, దేవెంద్ర బిషూ, జోసెఫ్, కమిన్స్‌.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top