తండ్రయిన జొకోవిచ్

తండ్రయిన జొకోవిచ్


బెల్‌గ్రేడ్ (సెర్బియా): ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ తండ్రయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం ఫ్రాన్స్‌లోని నైస్ పట్టణంలో జొకోవిచ్ భార్య జెలెనా రిస్టిక్ మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ బాబుకు స్టెఫాన్ అని పేరు పెట్టినట్లు ఈ సెర్బియా స్టార్ ట్వీట్ చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తండ్రి కాబోతున్నట్లు ప్రకటించిన జొకోవిచ్... జూలై 10న జెలెనాను వివాహం చేసుకున్నాడు. ‘కొన్నిరోజులు నా కుటుంబంతో గడుపుతాను. ఆ తర్వాత పారిస్ వెళ్లి మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఆడతాను’ అని జొకోవిచ్ తెలిపాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top