‘నార్తర్న్ మరో విజయం

‘నార్తర్న్ మరో విజయం


రాయ్‌పూర్: చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో ప్రధాన పోటీలకు అర్హత సాధించేందుకు న్యూజిలాండ్ జట్టు నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ చేరువైంది. ఆదివారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో 72 పరుగులతో లాహోర్ లయన్స్‌ను చిత్తు చేసి వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ఆటతీరుతో ముంబైపై ఘన విజయం సాధించిన పాక్ టీమ్ రెండో మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. నార్తర్న్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేయగా... లాహోర్ లయన్స్ 18 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. టిమ్ సౌతీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది.

 భారీ భాగస్వామ్యం...

 టాస్ ఓడిన డిస్ట్రిక్ట్స్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు డేవ్‌సిక్ (9), విలియమ్స్ (14) విఫలం కాగా, హారిస్ (13 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. నార్తర్న్ స్కోరు 36/3 వద్ద ఉన్న దశలో జత కలిసిన ఫ్లిన్ (30 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వాట్లింగ్ (37 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్) భారీ భాగస్వామ్యంతో జట్టును నడిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 9.3 ఓవర్లలోనే 90 పరుగులు జోడించడం విశేషం. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో పాక్ బౌలర్లంతా విఫలమయ్యారు. చీమాకు 3 వికెట్లు దక్కాయి.

 నసీమ్ ఒంటరి పోరాటం...

 లక్ష్యఛేదనలో లయన్స్ బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం నిలబడలేకపోయారు. తొలి ఓవర్ మినహా తర్వాతి ఐదు ఓవర్లలో ఆ జట్టు వరుసగా ఐదు వికెట్లు కోల్పోవడంతో జట్టు స్కోరు 19/5 వద్ద నిలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ టిమ్ సౌతీ (3/22)తో పాటు బౌల్ట్ (2/12), సోధి (2/30) లయన్స్‌ను దెబ్బ తీశారు. సహచరులంతా వెనుదిరిగినా... సాద్ నసీమ్ (40 బంతుల్లో 58; 4 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే పోరాడాడు. అతను మినహా ఇతర ఆటగాళ్లంతా ఒక అంకె స్కోరుకే పరిమితం కావడం విశేషం. ఆఖరి వికెట్‌గా రనౌట్ రూపంలో సాద్ అవుట్ కావడంతో లాహోర్ ఇన్నింగ్స్ ముగిసింది.

 స్కోరు వివరాలు

 నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ఇన్నింగ్స్: డేవ్‌సిక్ (సి) రియాజ్ (బి) రజా 9; విలియమ్సన్ (సి) అక్మల్ (బి) చీమా 14; హారిస్ (సి) అండ్ (బి) హఫీజ్ 20; ఫ్లిన్ (స్టంప్డ్) అక్మల్ (బి) రసూల్ 53; వాట్లింగ్ (సి) షెహజాద్ (బి) చీమా 53; స్టైరిస్ (సి) షెహజాద్ (బి) చీమా 14; మిచెల్ (నాటౌట్) 1; కుగ్‌లెన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 170

 వికెట్ల పతనం: 1-15; 2-36; 3-60; 4-150; 5-167; 6-167.

 బౌలింగ్: రజా 3-0-14-1; హఫీజ్ 4-0-35-1; చీమా 4-0-35-3; రసూల్ 3-0-29-1; రియాజ్ 4-0-33-0; అలీ 2-0-22-0.

 లాహోర్ లయన్స్ ఇన్నింగ్స్: జంషెద్ (బి) సౌతీ 5; షెహజాద్ (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 2; హఫీజ్ (సి) వాట్లింగ్ (బి) సౌతీ 5; సిద్దిఖ్ (ఎల్బీ) (బి) సౌతీ 3; అక్మల్ (బి) బౌల్ట్ 1; నసీమ్ రనౌట్ 58; రజా (సి) మిచెల్ (బి) స్టైరిస్ 5; రియాజ్ (ఎల్బీ) (బి) సోధి 2; అలీ (సి) విలియమ్సన్ (బి) సోధి 8; రసూల్ (రనౌట్) 4; చీమా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18 ఓవర్లలో ఆలౌట్) 98

 వికెట్ల పతనం: 1-5; 2-12; 3-16; 4-17; 5-19; 6-34; 7-37; 8-67; 9-80; 10-98. బౌలింగ్: బౌల్ట్ 4-0-12-2; సౌతీ 4-0-22-3; కుగ్‌లెన్ 3-1-13-0; స్టైరిస్ 3-0-20-1; సోధి 4-0-30-2.

 



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top