కివీస్ 183 ఆలౌట్

కివీస్ 183 ఆలౌట్


వెల్లింగ్టన్: ఆస్ట్రేలియాతో రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆరంభమైన తొలి టెస్టులో న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్లో 48.0 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన కివీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్(18), లాథమ్(6) పెవిలియన్ చేరి నిరాశపరిచారు. ఆ తరువాత విలియమ్సన్(16), బ్రెండన్ మెకల్లమ్(0), నికోలస్(8) అవుట్ కావడంతో కివీస్ 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై కోరీ అండర్సన్(38) , వాట్లింగ్(17),క్రెయిగ్(41 నాటౌట్), ట్రెంట్ బౌల్ట్(24)లు ఫర్వాలేదనిపించడంతో కివీస్ కాస్త తేరుకుంది. ఆసీస్ బౌలర్లలో  హజిల్ వుడ్ నాలుగు వికెట్లు, సిడెల్, లయాన్ లు తలో మూడు వికెట్లు తీసి కివీస్ పతనాన్ని శాసించారు.



అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఐదు పరుగులకే ఓపెనర్ల వికెట్లను నష్టపోయింది. బర్న్(0), డేవిడ్ వార్నర్(5)లను సౌతీ బోల్తా కొట్టించి ఆసీస్ కు షాకిచ్చాడు. కాగా, స్టీవ్ స్మిత్(71) ఆదుకోవడంతో ఆసీస్ గాడిలో పడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా(57 నాటౌట్), వోజస్(7 నాటౌట్) క్రీజ్ లో ఉన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top