ఎనిమిది నెలల తర్వాత...
నాదల్ ఖాతాలో మరో టైటిల్
బ్యూనస్ ఎయిర్స్: గతేడాది జూన్‌లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన తర్వాత ఫామ్ కోల్పోయిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ కొత్త ఏడాదిలో తొలి టైటిల్‌ను సాధించాడు. అర్జెంటీనా ఓపెన్‌లో ఈ మాజీ నంబర్‌వన్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో నాదల్ 6-4, 6-1తో యువాన్ మొనాకో (అర్జెంటీనా)పై గెలిచి ఎనిమిది నెలల తర్వాత తన ఖాతాలో మరో టైటిల్‌ను జమ చేసుకున్నాడు.
క్లే కోర్టులపై నాదల్‌కిది 46వ టైటిల్ కాగా.. ఓవరాల్‌గా 65వ టైటిల్. ఈ విజయంతో నాదల్ ఓపెన్ శకం (1968 తర్వాత)లో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ సాధించిన వారి జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు. జిమ్మీ కానర్స్ (109 టైటిల్స్), ఇవాన్ లెండిల్ (94), రోజర్ ఫెడరర్ (84), జాన్ మెకన్రో (77 టైటిల్స్) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.
సంబంధిత వార్తలు