'ఆ వైభవాన్ని మళ్లీ చూస్తానో.. లేదో'

'ఆ వైభవాన్ని మళ్లీ చూస్తానో.. లేదో'


లండన్:14 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించి అమోఘమైన రికార్డు కల్గిన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తన భవిష్యత్తపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. తాను మునపటి ఫామ్ ను తిరిగి చేజిక్కించుకోవడం చాలా కష్టసాధ్యంగా మారిందన్నాడు.  వింబుల్డన్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో నాదల్ 5-7, 3-6, 6-4, 6-4 తేడాతో డస్టిన్ బ్రౌన్(జర్మనీ)చేతిలో భంగపడ్డాడు. రెండో రౌండ్ లోనే వింబుల్డన్ టోర్నీ నుంచి నాదల్ నిష్ర్కమించడంతో  తన ఆటతీరుపై పలు సందేహాలు వ్యక్తం చేశాడు.


 


గతంలో తాను కొనసాగించిన అద్వితీయమైన ఆటను మరోసారి చూడలేమోనని ఆవేదన వ్యక్తం చేశాడు. 'నేను 2006, 2007,2008 లలో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాను. ఆ స్థాయిని అందుకోవడానికి ప్రయత్నిస్తా. ఇప్పటికే వింబుల్డన్ లో ఐదుసార్లు ఫైనల్ చేరి.. రెండు సార్లు ట్రోఫీలు కైవసం చేసుకున్నా.  మళ్లీ అంతటి పూర్వ వైభవం వస్తుందో లేదో తెలియడం లేదు. కాకపోతే అందుకోసం శ్రమిస్తా' అని నాదల్ తెలిపాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top