ముంబై ధాటికి తల్ల ఢిల్లీంది!

ముంబై ధాటికి తల్ల ఢిల్లీంది!


► 14 పరుగుల తేడాతో ఓడిన డేర్‌డెవిల్స్‌

► ముంబై ఇండియన్స్‌కు వరుసగా ఆరో విజయం  


ముంబై: ఈ సీజన్‌లో ముంబై తమ విజయపరంపరను కొనసాగిస్తోంది. శనివారం వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీండేర్‌డెవిల్స్‌పై 14 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. దీంతో వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ గెలిచి... విజయాల బాటలో ‘డబుల్‌ హ్యాట్రిక్‌’ను సాధించింది. మొదట బ్యాటింగ్‌లో తడబడ్డా... అసాధారణ బౌలింగ్‌తో ముంబై ఆటగాళ్లు అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు చేసింది.


అనంతరం ఊరించే లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ నిర్లక్ష్యంతో మూల్యం చెల్లించుకుంది. వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వచ్చినట్లే  పెవిలియన్‌ చేరారు. దాంతో ఢిల్లీ జట్టు ఒకదశలో 6 ఓవర్లలో 24 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ దశలో రబడ (39 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్‌), మోరిస్‌ (41 బంతుల్లో 52 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మొండిగా పోరాడారు. ఏడో వికెట్‌కు 91 పరుగులు జోడించినా జట్టును గెలిపించలేకపోయారు. చివరకు ఢిల్లీ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 128 పరుగులకు పరిమితమై ఓడిపోయింది. ముంబై బౌలర్లలో మెక్లీనగన్‌కు 3, బుమ్రాకు 2 వికెట్లు లభించాయి.

 

అంతకుముందు ముంబై ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు పార్థివ్‌ పటేల్, బట్లర్‌ ధాటిగా ఆరంభించారు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా తడబడింది. మొదట జట్టు స్కోరు 37 పరుగుల వద్ద పార్థివ్‌ (8), మరో పది పరుగులయ్యాక బట్లర్‌ (18 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) నిష్క్రమించారు. కాసేపటికి నితీశ్‌ రాణా (8), కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (5) కూడా పెవిలియన్‌ చేరడంతో ముంబై 60 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ దశలో పొలార్డ్‌ (29 బంతుల్లో 26; 4 ఫోర్లు), కృనాల్‌ పాండ్యా (17),  హర్దిక్‌ పాండ్యా (23 బంతుల్లో 24; 2 సిక్స్‌) కాస్త మెరుగ్గా ఆడి ముంబై స్కోరును పెంచేప్రయత్నం చేశారు. అమిత్‌ మిశ్రా, కమిన్స్‌ చెరో 2 వికెట్లు తీశారు.



స్కోరు వివరాలు:

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌:
పార్థివ్‌ పటేల్‌ (బి) రబడ 8; బట్లర్‌ రనౌట్‌ 28; నితీశ్‌ రాణా (సి) అండర్సన్‌ (బి) కమిన్స్‌ 8; రోహిత్‌ శర్మ (సి) కమిన్స్‌ (బి) మిశ్రా 5; పొలార్డ్‌ (సి) సామ్సన్‌ (బి) కమిన్స్‌ 26; కృనాల్‌ (సి) పంత్‌ (బి) మిశ్రా 17; హార్దిక్‌ రనౌట్‌ 24; హర్భజన్‌ రనౌట్‌ 2; మెక్లీనగన్‌ నాటౌట్‌ 1; జాన్సన్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు)142.

వికెట్ల పతనం: 1–37, 2–47, 3–56, 4–60, 5–84, 6–120, 7–132, 8–135. బౌలింగ్‌: రబడ 4–0–30–1, మోరిస్‌ 4–0–33–0, జహీర్‌ ఖాన్‌ 4–0–36–0, మిశ్రా 4–1–18–2, కమిన్స్‌ 4–0–20–2.

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) రోహిత్‌ (బి) మెక్లీనగన్‌ 9; ఆదిత్య తారే రనౌట్‌ 0; కరుణ్‌ నాయర్‌ (బి) హార్దిక్‌ పాండ్యా 5; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) పటేల్‌ (బి) మెక్లీనగన్‌ 6; అండర్సన్‌ ఎల్బీడబ్ల్యూ (బి) మెక్లీనగన్‌ 0; రిషభ్‌ పంత్‌ (సి) హర్భజన్‌ (బి) బుమ్రా 0; రబడ (బి) బుమ్రా 44; మోరిస్‌ నాటౌట్‌ 52; కమిన్స్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 128.

వికెట్ల పతనం: 1–1, 2–10, 3–20, 4–21, 5–21, 6–24, 7–115.

బౌలింగ్‌: జాన్సన్‌ 4–1–23–0, మెక్లీనగన్‌ 4–0–24–3, బుమ్రా 4–0–21–2, హార్దిక్‌ పాండ్యా 3–0–23–1, హర్భజన్‌ 4–0–26–0, కృనాల్‌ పాండ్యా 1–0–8–0.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top