బైక్‌తో బర్త్‌డే!

బైక్‌తో బర్త్‌డే!


సాధారణంగా బిజీ ఉద్యోగులు కాస్త విరామం లభిస్తే లేదా సెలవు దొరికితే రెగ్యులర్ పనికి బ్రేక్ ఇచ్చేస్తారు. ఆ సమయంలో ఇంటికి సంబంధించిన చిన్నా చితకా పనులు పూర్తి చేసుకోవడమో లేదా ఎప్పటివో పాత సామాన్ల దుమ్ము దులిపి ఒక పట్టు పట్టడమో చేస్తుంటారు. ఇప్పుడు భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా అదే పనిలో ఉన్నాడు. రాంచీలోని సొంత ఇంట్లో అతను తనకిష్టమైన పాత యమహా బైక్ కండిషన్ సరిదిద్దేందుకు సమాయత్తమయ్యాడు. బైక్ మెకానిక్‌ను ఇంటికి పిలిపించి పక్కనే కూర్చొని మరీ అతను రిపేర్లు చేయించుకున్నాడు. మంగళవారం ధోని 34వ పుట్టినరోజు కావడం విశేషం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top