హామిల్టన్‌కు ‘పోల్’


మోంటెకార్లో (మొనాకో) : ప్రపంచ డిఫెండింగ్ చాంపియన్, మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్... కెరీర్‌లో తొలిసారి మొనాకో గ్రాండ్‌ప్రి పోల్ పోజిషన్‌ను దక్కించుకున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రేసులో అతను 1ని.15.909 సెకన్ల టైమింగ్‌తో అత్యంత వేగవంతమైన ల్యాప్‌ను నమోదు చేశాడు. తనకు ఫేవరెట్ సర్క్యూట్ అయిన మొనాకోలో తొమ్మిదో ప్రయత్నంలో ఈ బ్రిటన్ డ్రైవర్ పోల్ పొజిషన్ సాధించాడు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్‌లో ఇది 40వ పోల్. మెర్సిడెస్ డ్రైవర్ నికో రోస్‌బెర్గ్ 1ని 15.440 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచాడు. హామిల్టన్‌కు ఇతని మధ్య తేడా కేవలం 0.342 సెకన్లు మాత్రమే.



వెటెల్ (ఫెరారీ-1ని 15.849 సెకన్లు), రెడ్‌బుల్ డ్రైవర్లు రికియార్డో (1ని.16.041 సెకన్లు), క్వియాట్ (1ని.16.182 సెకన్లు) వరుసగా మూడు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. కిమీ రైకోనెన్ (ఫెరారీ-1:16,427 సెకన్లు) ఆరో స్థానం నుంచి, ఫోర్స్ ఇండియా డ్రైవర్  పెరెజ్ (1:16,808 సెకన్లు) ఏడో స్థానం నుంచి రేసు మొదలుపెడతారు. సైంజ్ (టోరో రోసో), మల్డోనాలో (లోటస్), వెర్‌స్టాపెన్ (టోరో రోసో) వరుసగా ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలను సాధించారు.

 ప్రధాన రేసు నేటి సాయంత్రం గం. 5.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top