చెలరేగిన మిలింద్, త్యాగి


సాక్షి, హైదరాబాద్: ఎ1-డివిజన్ మూడు రోజు లీగ్‌లో మంగళవారం మొదలైన అన్ని మ్యాచ్‌ల్లోనూ బౌలర్ల ప్రతాపమే కనబడింది. జింఖానా గ్రౌండ్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో డెక్కన్ క్రానికల్ బౌలర్లు సీవీ మిలింద్ (5/49), సుదీప్ త్యాగి (5/45)లు ఎన్స్‌కాన్స్ బ్యాట్స్‌మెన్‌పై జూలు విదిల్చారు. ఏ దశలోనూ అవకాశమివ్వకుండా చెలరేగారు. దీంతో ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్‌లో 37.5 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. తర్వాత తొలి ఇన్నింగ్ ఆరంభించిన డెక్కన్ క్రానికల్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 41 పరుగులు చేసింది. వర్షం వల్ల మైదానం చిత్తడిగా మారడంతో మొదటి రోజు పూర్తిస్థాయి ఆట సాధ్యపడలేదు. ఏఓసీ మైదానంలో ఎంపీ కోల్ట్స్- ఏఓసీ జట్ల మధ్య, రైల్వే గ్రౌండ్స్‌లో ఆర్.దయానంద్-దక్షిణమధ్య రైల్వే జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ల్లో తొలి రోజు ఆట పూర్తిగా రద్దయింది.

 

 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు

 బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 142 (అనిరుధ్ 6/56, అన్వర్ అహ్మద్ 2/61, పాండే 2/20), హైదరాబాద్ బాట్లింగ్ తొలి ఇన్నింగ్స్: 91/1 (సరేందర్ సింగ్ 37 బ్యాటింగ్, వినయ్ గౌడ్ 34)

 ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 82 (సూర్యప్రకాశ్ 5/31, చందన్‌సహాని 5/46), కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 229/3 (అన్షుల్ లాల్ 67, చైతన్యకృష్ణ 64 బ్యాటింగ్, శాండిల్య 41; కృష్ణచరిత్ 3/53)

 

 రాణించిన విశాల్: ఎస్‌బీహెచ్ 216/7

 తొలి రోజు బ్యాటింగ్‌కు దిగిన అన్ని జట్లు ఆలౌటైతే ఒక్క ఎస్‌బీహెచ్ మాత్రమే విశాల్ శర్మ (94 బంతుల్లో 50 బ్యాటింగ్, 8 ఫోర్లు) రాణించడంతో నిలబడింది. ఆంధ్రాబ్యాంక్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదటి రోజు ఆటలో ఎస్‌బీహెచ్ తొలి ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. డాని డెరెక్ ప్రిన్స్ (38), శ్రీహరిరావు (37) ఫర్వాలేదనిపించారు. ఆంధ్రాబ్యాంక్ బౌలర్ ఎం.ఎ.ఖాదర్ 4 వికెట్లు తీశాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top