పతకాలతో మెరిసిన భారత లిఫ్టర్లు


ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ 




న్యూఢిల్లీ: భారత లిఫ్టర్లు ప్రపంచ యూత్ వెరుుట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పతకాలతో మెరిశారు. మలేసియాలోని పెనాంగ్‌లో జరిగిన ఈ పోటీల్లో జెరిమి లాల్రినుంగా రజతం గెలుపొందగా, ముత్తుపాండి రాజా కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు. బాలుర 56 కేజీల కేటగిరీలో జెరిమి స్నాచ్‌లో 108 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 127 కేజీలు... మొత్తం 235 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు.



ఇదే కేటగిరీలో రాజా స్నాచ్‌లో 100 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 133 కేజీలు... మొత్తం 233 కేజీల బరువెత్తి కాంస్య పతకం గెలుచుకున్నాడు. బాలికల 48 కేజీల కేటగిరీలో మోహిని చవాన్ 6వ స్థానంలో జిల్లీ దలబెహెరా 9వ స్థానంలో, 44 కేజీల విభాగంలో షరబాని దాస్ 6వ స్థానంలో నిలిచారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top