హామిల్టన్‌కు పోల్‌ పొజిషన్‌

హామిల్టన్‌కు పోల్‌ పొజిషన్‌ - Sakshi


నేడు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి

మెల్‌బోర్న్‌: ఫార్ములావన్‌ కొత్త సీజన్‌లో మాజీ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌కు శుభారంభం లభించింది. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో ఈ మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ అందరికంటే వేగంగా ఒక నిమిషం 22.188 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. సీజన్‌లో తొలి ‘పోల్‌ పొజిషన్‌’ సంపాదించాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్‌ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌కిది వరుసగా నాలుగో ‘పోల్‌’ కావడం విశేషం. భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, ఎస్టెబన్‌ ఒకాన్‌ వరుసగా 11వ, 14వ స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు.



గ్రిడ్‌ పొజిషన్స్‌: 1. హామిల్టన్‌ (మెర్సిడెస్‌), 2. వెటెల్‌ (ఫెరారీ), 3. బొటాస్‌ (మెర్సిడెస్‌), 4. రైకోనెన్‌ (ఫెరారీ), 5. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌), 6. గ్రోస్యెన్‌ (హాస్‌), 7. మసా (విలియమ్స్‌), 8. సెయింజ్‌ (ఎస్టీఆర్‌), 9. క్వియాట్‌ (ఎస్టీఆర్‌), 10. రికియార్డో (రెడ్‌బుల్‌), 11. పెరెజ్‌ (ఫోర్స్‌ ఇండియా), 12. హుల్కెన్‌బర్గ్‌ (రెనౌ), 13. అలోన్సో (మెక్‌లారెన్‌), 14. ఒకాన్‌ (ఫోర్స్‌ ఇండియా), 15. ఎరిక్సన్‌ (సాబెర్‌), 16. జియోవినాజి (సాబెర్‌), 17. మాగ్నుసెన్‌ (హాస్‌), 18. వాన్‌డోర్నీ (మెక్‌లారెన్‌), 19. స్ట్రోల్‌ (విలియమ్స్‌), 20. పాల్మెర్‌ (రెనౌ).

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top