లలిత్బాబుకు రెండో విజయం
అల్ అయిన్ (యూఏఈ): ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు రెండో విజయాన్ని సాధించాడు. సోమవారం జరిగిన ఓపెన్ విభాగం రెండో గేమ్‌లో లలిత్ 78 ఎత్తుల్లో లూ యిపింగ్ (చైనా)పై గెలిచాడు. తొలి రౌండ్లో లలిత్ 57 ఎత్తుల్లో లీ డీ (చైనా)ను ఓడించాడు. ఓపెన్ విభాగంలో పోటీపడుతున్న తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి తొలి రౌండ్లో 42 ఎత్తుల్లో అబ్దిజపార్ (కిర్గిజిస్తాన్) చేతిలో ఓడిపోగా... బషీర్ (సిరియా)తో జరిగిన గేమ్‌ను హారిక 32 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది.