క్రికెట్‌కు కైల్ మిల్స్ గుడ్‌బై

క్రికెట్‌కు కైల్ మిల్స్ గుడ్‌బై


రిటైర్మెంట్ ప్రకటించిన కివీస్ బౌలర్

వెల్లింగ్టన్: సహచరుడు డానియెల్ వెటోరి బాటలోనే మరో న్యూజిలాండ్ క్రికెటర్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 36 ఏళ్ల పేస్ బౌలర్ కైల్ మిల్స్ రిటైర్ అవుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. 14 ఏళ్ల కెరీర్‌లో ప్రధానంగా వన్డే స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న మిల్స్, కివీస్ తరఫున 170 వన్డేల్లో 27.02 సగటుతో 240 వికెట్లు పడగొట్టాడు. వెటోరి తర్వాత అత్యధిక వికెట్లు తీసిన రెండో కివీస్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 19 టెస్టుల్లో 44 వికెట్లు తీసిన అతను, 42 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లలో 43 వికెట్లు పడగొట్టాడు.



నిలకడగా ప్రపంచ టాప్-10 ర్యాంకుల్లో కొనసాగిన మిల్స్, చాలా కాలం పాటు నంబర్‌వన్ స్థానంలో కూడా నిలిచాడు. ‘14 ఏళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం. రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం. ఇకపై కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తాను’ అని ఈ సందర్భంగా మిల్స్ వ్యాఖ్యానించాడు. మూడు ప్రపంచకప్‌లలో పాల్గొన్న మిల్స్...ఈ సారి టోర్నీలో కివీస్ జట్టులో సభ్యుడిగా ఉన్నా ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top