ఏకాగ్రత మొత్తం బౌలింగ్‌ మీదనే..

ఏకాగ్రత మొత్తం బౌలింగ్‌ మీదనే..

 ప్రస్తుతం నా ఏకాగ్రత మొత్తం బౌలింగ్‌ మీదనే పెడుతున్నాని కేకేఆర్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ అంటున్నాడు. ఆడాలనే తపన, పట్టుదల ఉండాలి కానీ ఫిచ్‌తో సంబంధం లేదని పేర్కొన్నాడు.  బౌలింగ్‌ మంచిగా చేయాలనే లక్ష్యంతోనే ముందుకు పోతున్నానని తెలిపాడు. ఆస్ర్టేలియా జట్టుతో జరిగిన ధర్మశాల టెస్ట్‌ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌ను కుల్దీప్‌ ప్రారంభించాడు. తన మొదటి మ్యాచ్‌తో అందరిన్ని అకట్టుకున్నడు ఈ   ‘చైనామన్‌’ స్నీన్నర్‌. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో అరంగేట్రం చేసిన యువ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తొలి మ్యాచ్‌లోనే వీరోచిత ప్రతిభతో పర్యాటక జట్టును మట్టికరిపించిన విషయం తెలిసిందే.





 తన స్పిన్‌ను మెరుగుపరుచుకోవడానికి స్పిన్‌ బౌలింగ్‌ దిగ్గజం, ఆస్ట్రేలియా లెజండరీ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ నుంచి సలహాలు తీసుకున్నట్టు చెప్పాడు. ఈ చైనామన్‌ యంగ్‌ బౌలర్‌ ప్రస్తుత సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరపున ఐపీఎల్‌ -10 ఆడుతున్నాడు. ప్రస్తుత సీజన్‌లో బాగా ఆడాలనే విశ్వాసంతో ఉన్నాడు. అంతేకాక కోల్‌కతా టీమ్‌ విజయాల్లో తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకోవాలనే నమ్మకంతో ముందుకుపోతున్నానని కుల్దీప్‌ చెప్పాడు. తమ జట్టు స్పీన్‌  బౌలింగ్‌తో ప్రత్యర్ధి టీమ్‌ను కట్టడి చేస్తున్నామని చెప్పాడు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లతో ఆడటం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. అనుభవం ఉన్న సీనియర్ల నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చని అన్నాడు. ఈ సీజన్‌లో తన పాత్ర కూడా చాలా అవసరమని, మంచిగా రాణించి జట్టుకు విజయాలు అందించాలనే విశ్వాసం కుల్దీప్‌ యాదవ్‌ వ్యక్తం చేశాడు.
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top