కేరళ బ్లాస్టర్స్ లోగో ఆవిష్కరణ

కేరళ బ్లాస్టర్స్ లోగో ఆవిష్కరణ

కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు చెందిన కొచ్చి ఫ్రాంచైజీ సోమవారం తమ జట్టు లోగోను ఆవిష్కరించింది. బలమైన ఏనుగును కేంద్రంగా చేసుకొని రూపొందించిన ఈ లోగోలో కేరళ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేశారు. తొండంపై ఫుట్‌బాల్‌ను కలిగిన ఏనుగును పేరు కింద ఉండేటట్లు రూపొందించారు. బ్లాస్టర్స్ జట్టు ఆటగాళ్లు ఎల్లో జెర్సీతో పాటు సంప్రదాయబద్ధమైన ధోవతిని ధరించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘కేరళ సంస్కృతి, క్రీడల్లో ఆధిపత్యానికి గుర్తుగా ఏనుగుతో ఈ లోగోను రూపొందించాం. బలానికి, గౌరవానికి ప్రతీకగా ఏనుగును తీసుకున్నాం. కేరళ బ్లాస్టర్స్ ఆకాంక్షను ఈ లోగో ప్రతిబింబిస్తుంది’ అని ఫ్రాంచైజీ సహ యజమాని పొట్లూరి ప్రసాద్ తెలిపారు. కేరళ బ్లాస్టర్స్ లోగోను బ్రాష్ బ్రాండ్స్ కంపెనీ రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ ఫుట్‌బాల్ క్లబ్‌లపై ప్రత్యేక అధ్యయనం చేసిన తర్వాత ఈ లోగోను తయారు చేశామని కంపెనీ యజమాని జాన్ బ్రాష్ తెలిపారు. అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 20 వరకు ఐఎస్‌ఎల్ టోర్నీ జరగనుంది.

 

 


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top