ఓపెనర్లు ఇద్దరూ అవుట్


కాన్ బెర్రా: 412 పరుగుల భారీ లక్ష్యంతో పసికూన ఐర్లాండ్ ఆరంభంలోనే పీకల్లోతు కష్టాల్లోపడింది. 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా పేసర్ స్టెయిన్ ఐర్లాండ్ ను చావుదెబ్బ తీశాడు.



జట్టు స్కోరు 17 పరుగుల వద్ద స్టెయిన్ బౌలింగ్ లో ఓపెనర్ స్టిర్లింగ్ అవుటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో పోర్టర్ ఫీల్డ్ పెవిలియన్ చేరగా, స్టెయిన్ వేసిన మరుసటి ఓవర్లో జాయ్సె అదే బాటపట్టాడు. వీరు ముగ్గురూ క్యాచవుటయ్యారు.  ఐర్లాండ్ 5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 25 పరుగులు చేసింది.



 ప్రపంచ కప్ గ్రూప్-బిలో భాగంగా మంగళవారం జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top