నరైన్ బౌలింగ్‌పై మళ్లీ ఫిర్యాదు

నరైన్ బౌలింగ్‌పై మళ్లీ ఫిర్యాదు


 న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ శైలి మరోసారి సందేహాస్పదంగా మా రింది. ఈనెల 22న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు వేసిన కొన్ని బంతులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అంపైర్లు ఫిర్యాదు చేసినట్టు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

 

  అయితే లీగ్ పాలసీ ప్రకారం అతడు మున్ముందు జరిగే మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయవచ్చని, కానీ బయో మెకానికల్ విశ్లేషణ కోసం చెన్నైలోని ఎస్‌ఆర్‌ఏఎస్‌ఎస్‌సీ సెంటర్‌కు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top