ఆ మ్యాచ్లకు మెస్సీ డౌటే!

ఆ మ్యాచ్లకు మెస్సీ డౌటే! - Sakshi


బ్యూనస్ ఎయర్స్: లియోనల్ మెస్సీది పరిచయం అవసరం లేని పేరు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో అభిమానులను సంపాదించుకున్న ఫుట్‌బాల్ ఆటగాడు అతడు. అయితే గత కొంతకాలంగా గాయాలతో బాధపడుతున్న అర్జెంటీనా ఫుట్ బాల్ సూపర్ స్టార్ మెస్సీ ఇప్పట్లో పిచ్ లోకి దిగే అవకాశం కనిపించడంలేదు. వైద్యులు అనుమతించనిదే తాను తిరిగి ఫుట్ బాల్ పిచ్ లో అడుగు పెట్టలేనని అన్నాడు. తాను పూర్తిగా కోలుకున్నానని వైద్యులు ఎప్పుడు చెప్తారో అప్పుడే ఆట తిరిగి ప్రారంభిస్తానని చెప్పాడు.



గత సెప్టెంబర్ 26న జరిగిన స్పానిష్ లీగ్లో మెస్సీ ఎడమకాలికి గాయం అయింది. రెండు నెలలు పూర్తయితేగానీ అతడు తిరిగి బరిలోకి దిగే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. అయితే, నవంబర్లో ఫిఫా వరల్డ్ కప్ కోసం బ్రెజిల్, కొలంబియాపై జరిగే క్వాలిఫైయింగ్ మ్యాచ్ టీంలో మెస్సీని కూడా చేర్చే అవకాశం ఉందని ఊహాగానాలు వ్యాపించాయి. దీనిపై మెస్సీ వివరణ ఇచ్చాడు. తనకు ఎప్పుడూ ఆట ఆడాలనే ఉంటుందని, రేపటికి రేపు ఆడమన్నా ఆడుతానని, కానీ వైద్యులు మాత్రం అందుకు అనుమతించరని చెప్పాడు. అందుకే వైద్యులు ఎప్పుడంటే అప్పుడే పిచ్ లో అడుగు పెడతానని స్పష్టం చేశాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top