శ్రీలంకతో సిరీస్ను ధోని సేన గెలిస్తేనే..

శ్రీలంకతో సిరీస్ను ధోని సేన గెలిస్తేనే.. - Sakshi


న్యూఢిల్లీ:ఇటీవల ట్వంటీ 20 ఫార్మాట్లో నంబర్ వన్ ర్యాంకును సాధించిన టీమిండియా  ఆ ర్యాంకును మరికొంతకాలం పదిలంగా ఉంచుకోవాలంటే త్వరలో శ్రీలంకతో జరిగే సిరీస్ ను కూడా చేజిక్కించుకోవాల్సిందే. మరో రెండు రోజుల్లో శ్రీలంకతో మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ జరుగనున్న నేపథ్యంలో టీమిండియా తన ర్యాంకును పదిలంగా ఉంచుకోవాలంటే సిరీస్ ను గెలవాలి. మూడు మ్యాచ్ లను గెలవాల్సిన అవసరం లేకపోయినా, కనీసం రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలి.  కానిపక్షంలో టీమిండియా ఏడో ర్యాంకుకు పడిపోవడం ఖాయం. ఒకవేళ అదే సమయంలో శ్రీలంక సిరీస్ ను 2-0 తేడాతో గెలిచినా, లేక క్లీన్ స్వీప్ చేసినా టాప్ స్థానానికి చేరుకుంటుంది.



 


ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి టీమిండియా నంబర్ వన్ ర్యాంకును సాధించింది. ఆ సిరీస్ కు ముందు ఎనిమిదో స్థానంలో ఉన్న టీమిండియా ఆ తరువాత ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సిరీస్ ద్వారా విరాట్ కోహ్లి వ్యక్తిగత టీ 20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్ లో కోహ్లి మూడు హాఫ్ సెంచరీలతో రాణించాడు. మంగళవారం పుణేలో ఆరంభంకానున్న టీ 20 సిరీస్ లో టీమిండియా 120 రేటింగ్ పాయింట్లతో బరిలోకి దిగుతుండగా, మూడో స్థానంలో ఉన్న శ్రీలంక 117 రేటింగ్ పాయింట్లతో పోరుకు సన్నద్ధమవుతుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top