‘సచిన్‌.. మీరింకా సో యంగ్‌ ’

‘సచిన్‌.. మీరింకా సో యంగ్‌ ’

సచిన్‌ పేరు తెలియనివారు ఉండరు. క్రికెట్‌ దేవుడిగా అతని అభిమానులు పిలుస్తారు. వన్డే, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌ ఏవరంటే వేంటనే క్రికెట్‌ అభిమానులకు గుర్తుకోచ్చే పేరు సచిన్‌ టెండూల్కర్‌. వన్డే మ్యాచ్‌లో​ తొలి డబులు సెంచరీ చేసిన ఘనత కూడా సచిన్‌కే దక్కింది. మైదానంలోకి సచిన్‌ వస్తే అభిమానులకు  పండుగే. అంతేకాక అంతర్జాతీయ మ్యాచ్‌లో వంద సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌. 2013 నవంబర్‌లో సచిన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ వీడ్కొలు పలికాడు.



ఆ మాస్టర్‌కు నేడు 44వ పుట్టినరోజు. ఈ సందర్బంగా   క్రికెటర్స్‌ సచిన్కు పుట్టినరోజు  శుభకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం సచిన్‌ ముంబాయ్‌ ఇండియన్స్‌కు మెంటర్‌గా ఉన్నారు. అంతేకాక బీసీసీఐ తీసుకునే కీలక నిర్ణయాల్లో  సచిన్‌ సలహాలు పాటిస్తారు. చిరకాలం సచిన్‌కు అభిమానుల మనసులో స్థానం ఉంటుంది. ఇప్పటికి క్రికెట్‌ జరిగే ప్రదేశాల్లోనూ, కార్యక్రమాల్లోనూ మనకు సచిన్‌ సచిన్‌ అనే పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఈ సందర్భంగా ఇండియా టీమ్‌ కోచ్, మాజీ కెప్టెన్‌, అనిల్‌కుంబ్లే పుట్టినరోజు శుభకాంక్షలను తన ట్విట్‌ ద్వారా తెలిపారు. ప్రపంచం చూసిన అత్యంత స్పూర్తిదాయకమైన క్రీడాకారులలో సచిన్‌ ఒకరని ట్వీట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.





ఇలాంటి పుట్టిన  రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నానని కుంబ్లే ట్విట్‌ చేశాడు. మైఖేల్‌ క్లార్క్‌ కూడా  తన ట్వీట్‌ ద్వారా సచిన్‌కు పుట్టినరోజు శుభకాంక్షలు తెలిపాడు. 44 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఈరోజుకి మీరు చాలా యంగ్‌గా కనిపిస్తున్నారని ట్వీట్‌ చేశాడు. ఇండియా క్రికెటర్‌ ఆర్‌పీ సింగ్‌ మాస్టర్‌కు పుట్టినరోజు శుభకాంక్షలు తెలిపాడు. ఎప్పటికీ మా అందరికీ మీరే స్పూర్తి అని తన మనసులోనే మాటను ట్వీట్‌ ద్వారా తెలిపాడు. ఇండియా క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన ట్వీట్‌తో  శుభకాంక్షలు తెలిపాడు. ఏప్రిల్‌ 24 ను ఇండియన్‌ క్రికెట్‌ డే గుర్తింస్తుందని ట్వీట్‌ చేశాడు. మీతో కలిసి క్రికెట్‌ ఆడినందుకు నేను చాలా అదృష్టవంతుడినని  సచిన్‌పై వున్న అభిమానాన్ని ట్వీట్‌తో తెలియజేశాడు.  అంతేకాక పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సచిన్‌కు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు.





Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top