రేపు రవీంద్ర జడేజా నిశ్చితార్థం
రాజ్కోట్: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా త్వరలో ఓ ఇంటి కానున్నాడు. నగరానికి చెందిన రీవా సోలాంకితో జడేజా ఏడు అడుగులు వేయనున్నాడు. ఈ మేరకు జడేజా-సోలాంకిల నిశ్చితార్థం శుక్రవారం జరుగనుంది. జడేజాకు చెందిన రెస్టారెంట్ లో నిశ్చితార్థం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అతని అక్క నైనా జడేజా వెల్లడించారు.
ఇటీవల అతిమ్యా కాలేజీలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన రీవా ప్రస్తుతం యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. రీవా తండ్రి వ్యాపారవేత్త కాగా, ఆమె తల్లి రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు.