పాతవాళ్లను పిలుస్తున్నారు

పాతవాళ్లను పిలుస్తున్నారు


గౌతమ్ గంభీర్ భారత జట్టు తరఫున టెస్టు ఆడి రెండేళ్లు దాటింది...మరి కొద్ది రోజుల్లో అతను 36వ ఏట అడుగు పెడుతున్నాడు. కొత్త సారథి నేతృత్వంలో కొత్తగా కనిపిస్తూ వరుస విజయాలు సాధిస్తున్న జట్టులోకి ఈ వెటరన్‌ను తిరిగి తీసుకున్నారు. దేశవాళీ క్రికెట్‌లో ఒక సీనియర్ ఫామ్‌ను చూసి గౌరవించారా లేక ప్రతిభ గల కుర్రాళ్లెవరూ అందుబాటులో లేక మళ్లీ వెనక్కి వెళుతున్నారా!

 

 వన్డేల్లో యువరాజ్ సింగ్ బరిలోకి దిగి మూడు సంవత్సరాలు కావస్తోంది. అతనికీ ఈ ఏడాది చివరికి 35 ఏళ్లు పూర్తవుతాయిచాలా కాలంగా ఫిట్‌నెస్ సమస్యలు ఉన్నాయిఆహా అనిపించే ప్రదర్శన ఏదీ ఇటీవల అతడి నుంచి రాలేదు.  కానీ వన్డేల్లో అతని పునరాగమనం కూడా ఖాయమైనట్లు తెలుస్తోంది. ఎంతో మంది యువ ఆటగాళ్లు దూసుకొచ్చి తమ స్థానం పదిలం చేసుకున్న సమయంలో యువీని పిలవాలనుకోవడం ఆశ్చర్యకరం!

 

 దిగ్గజ క్రికెటర్లు రిటైరైన తర్వాత కూడా భారత టెస్టు జట్టు ఊహించనంత వేగంగా నిలదొక్కుకొని పటిష్టంగా మారింది. అటు వన్డేల్లో కూడా అవకాశం దక్కినవారిలో చాలా మంది తమను తాము నిరూపించుకొని రెగ్యులర్ స్థానానికి అర్హత సాధించారు. ఇలాంటి స్థితిలో మళ్లీ సీనియర్లను తెచ్చి ప్రయోగం చేయడం సత్ఫలితాలనిస్తుందా... జట్టుపై దీని ప్రభావం ఉండదా!

 

సాక్షి క్రీడా విభాగం :  టెస్టులో గాయపడిన లోకేశ్ రాహుల్ స్థానంలో గౌతమ్ గంభీర్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. శుక్రవారం నుంచి రెండో టెస్టు జరిగే కోల్‌కతాలో అతను జట్టుతో పాటు చేరతాడు. ఢిల్లీ రంజీ జట్టు సన్నాహక శిబిరంలో ఉన్న గంభీర్ హడావిడిగా మంగళవారం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్లి ఫిట్‌నెస్ టెస్టులో పాసయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ అందుబాటులో ఉన్నా... ముందు జాగ్రత్తగా గంభీర్‌ను పిలిచారు. మరో వైపు యువరాజ్ కూడా మంగళవారం జరిగిన ఫిట్‌నెస్ టెస్టులో పాసయ్యాడు. వన్డేల్లో అతను ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇటీవల దులీప్ ట్రోఫీ సందర్భంగా వీరిద్దరిని స్వయంగా కలిసిన కుంబ్లే... రానున్న సుదీర్ఘ సీజన్ కోసం శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది.

 

 దులీప్ ట్రోఫీలో రాణించి...

 ‘నిరాశ చెందాను కానీ ఓడిపోలేదు. పక్కకు తోసేశారు కానీ భయపడటం లేదు. అయితే నేను పోరాడటం ఆపను‘... ఇటీవల టెస్టు జట్టులో స్థానం లభించనప్పుడు గంభీర్ చేసిన ట్వీట్ ఇది. చాలా మంది సీనియర్లతో పోలిస్తే ఓటమిని అంగీకరించకుండా అతను తన పునరాగమనం కోసం గట్టి ప్రయత్నాలే చేశాడు. దులీప్ ట్రోఫీలో వరుసగా నాలుగు అర్ధసెంచరీలు సహా ఐదు ఇన్నింగ్‌‌సలలో కలిపి అతను 356 పరుగులు చేశాడు. గత ఏడాది రంజీ ట్రోఫీలో అతను గొప్పగా రాణించలేదు.

 

  ఒక్క సెంచరీ కూడా లేకుండా 14 ఇన్నింగ్‌‌సలలో 38 సగటుతో 488 పరుగులు మాత్రమే చేశాడు. అరుుతే తన స్వార్థం కోసం కాకుండా జట్టు గెలుపు లక్ష్యంగా ఆడానని, తక్కువ పరుగులే అరుునా అవి వచ్చిన కీలక సందర్భాలను బట్టి తనను అంచనా వేయాలని గంభీర్ చెప్పుకున్నాడు. నిజానికి టెస్టు జట్టుకు దూరమైన తర్వాత రెండేళ్ల క్రితం ఇంగ్లండ్ సిరీస్‌లో అతనికి అనూహ్యంగా పిలుపు దక్కింది. అయిగు ఇన్నింగ్‌‌సలో కలిపి 25 పరుగులే చేయడంతో మళ్లీ చోటు కోల్పోయాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో గంభీర్ 34 ఇన్నింగ్‌‌సలలో దాదాపు 49 సగటుతో 1580 పరుగులు చేసి రెండో స్థానంలో నిలవడం విశేషం.

 

 అరుుతే సత్తా చాటి జాతీయ జట్టులో అవకాశం కోసం ఎదురు చూస్తున్న యువ ఆటగాళ్లకూ కొదవ లేదు. గత ఏడాది రంజీలో అత్యధిక పరుగులు సాధించిన శ్రేయస్ అయ్యర్ (1321 పరుగులు- 21 ఏళ్లు) కూడా టాపార్డర్ బ్యాట్స్‌మన్. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న అఖిల్ హేర్వాడ్కర్ (879- 21 ఏళ్లు) ముంబై తరఫున ఓపెనర్‌గానే ఆడతాడు. ఇంతకు ముందు భారత్‌కు ఆడి విఫలమైన 26 ఏళ్ల ఓపెనర్ ముకుంద్ గత రెండేళ్లలో భారత దేశవాళీలో అత్యంత నిలకడైన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రదర్శననే పరిగణనలోకి తీసుకుంటే గంభీర్‌కంటే నిలకడగా ఆడాడు.

 

యువరాజ్‌లో సత్తా ఉందా..?

 గత ఏడాది విజయ్ హజారే వన్డే టోర్నీలో రాణించడంతో యువరాజ్‌సింగ్‌కు అనూహ్యంగా భారత టి20 జట్టులోకి పిలుపు లభించింది. ఆసీస్ టూర్ మొదలు వరల్డ్ కప్ వరకు టీమ్‌లో ఉన్న అతను సెమీస్ మ్యాచ్‌కు ముందు గాయంతో తప్పుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో టి20ల్లో అతను అద్భుతాలేమీ చేయలేదు. 11 ఇన్నింగ్‌‌సలలో కేవలం 104 స్టైక్‌ర్రేట్‌తో 166 పరుగులు చేసి 5 వికెట్లు తీశాడు! ఐపీఎల్‌లో ఆకట్టుకోని అతను, దులీప్ ట్రోఫీలో నాలుగు ఇన్నింగ్‌‌సలోనూ విఫలమయ్యాడు. వన్డే టీమ్‌లోకి మళ్లీ అతనికి అవకాశం కల్పించే ప్రదర్శన ఏదీ అతనినుంచి రాలేదు.

 

 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాతి నుంచి మూడేళ్ల క్రితం వన్డే టీమ్‌లో స్థానం కోల్పోయే వరకు 19 మ్యాచ్‌లలో యువీ చేసింది 2 అర్ధ సెంచరీలే. ఇలాంటి స్థితిలో అతడిని మళ్లీ తీసుకురావడం అంటే యువ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయడమే. ఆసీస్‌తో ఆడిన మ్యాచ్‌లో మనీశ్ పాండే అద్భుత సెంచరీతో అలరించాడు. జింబాబ్వే సిరీస్‌లో ఆకట్టుకున్న కరుణ్ నాయర్, మన్‌దీప్ సింగ్‌లాంటి కుర్రాళ్లు తాము వన్డేల కోసం సిద్ధంగా ఉన్నట్లు నిరూపించారు. సుదీర్ఘ కాలం కీలక పాత్ర పోషించిన రైనాకే చోటు లేని వన్డే జట్టులో ఉన్నపళంగా యువీని తేవాలనుకోవడం వెనక ఆంతర్యమేమిటో..!

 

 కుంబ్లే ఆలోచన ఏమిటి..?

 ప్రధాన కోచ్‌గా ఇప్పుడు జట్టు ఎంపికలో అనిల్ కుంబ్లే పాత్రనే కీలకంగా మారిందని, అన్నింటా ఆయన ముద్ర ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. టెస్టు సిరీస్‌లో కోహ్లి ఐదుగురు బౌలర్ల థియరీలో కూడా కుంబ్లే వచ్చాకే మార్పు జరిగింది. అరుుతే యువ ఆటగాళ్లతో మరింతగా దూసుకుపోవాల్సిన తరుణంలో ఎప్పుడో నమ్మకం కోల్పోరుున ఆటగాళ్లను తిరిగి తీసుకురావాలనే కుంబ్లే ఆలోచనే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తనతో కలిసి ఆడిన, గతంలో గంభీర్, యువరాజ్ ఆటను దగ్గరినుంచి చూసిన కుంబ్లేకు వారిపై విశ్వాసం ఉండవచ్చు. సీనియర్లు కూడా ఉంటే బాగుంటుందనే ఆలోచన కూడా కావచ్చు.

 

 తన మాటను నెగ్గించుకోవాలని పరోక్ష ఉద్దేశం కూడా ఇందులో కనిపిస్తోంది. కానీ మా కుర్రాళ్లు అంటూ కోహ్లి బలంగా నమ్మకముంచి అందరినీ ప్రోత్సహిస్తున్న సమయంలో వెటరన్లు రావడం కూర్పును దెబ్బ తీసే అవకాశం ఉంది. కెరీర్ చివర్లో ఉన్న ధోని గతంలోలాగా అన్ని విషయాలు పట్టించుకోవడం లేదు. కానీ కోహ్లి వైపునుంచి చూస్తే మాత్రం గంభీర్ పునరాగమనం అతడిని ఇబ్బంది పెట్టవచ్చు. గంభీర్, కోహ్లి మధ్య ‘యుద్ధం’ ఇటీవలి ఐపీఎల్ సమయంలోనూ కొనసాగింది. రాహుల్ లేకపోతే తుది జట్టులో కచ్చితంగా ధావన్‌కే అవకాశం ఇవ్వడానికే కోహ్లి ఇష్టపడతాడు. మరో వైపు గంభీర్, యువరాజ్ సింగ్‌లను మళ్లీ ఆడించి అధికారికంగా వీడ్కోలు చెప్పిస్తున్నారనే మాట కూడా వినిపిస్తోంది.

 

 జయంత్ యాదవ్‌కు చోటు

 న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మిగతా మ్యాచ్‌ల కోసం ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్‌ను కూడా ఎంపిక చేశారు. ఇషాంత్ శర్మ స్థానంలో జయంత్ జట్టులోకి వచ్చాడు. హర్యానాకు చెందిన 26 ఏళ్ల జయంత్ 42 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 117 వికెట్లు పడగొట్టాడు.  

 

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top