టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్

టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్


ప్రతీ జట్టు లక్ష్యం ప్రపంచ చాంపియన్ కావడం. విజేతగా నిలిచేది మాత్రం ఒక్కటే. వరుసగా రెండోసారి ప్రపంచ కప్ సాధించాలన్న టీమిండియా కల సాకారం కాలేదు. డిఫెండింగ్ చాంపియన్ భారత్ సెమీస్లోనే నిష్ర్కమించింది. ఈ మెగా ఈవెంట్లో అద్భుతంగా ఆడిన ధోనీసేన.. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో బోల్తాపడింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఆ జట్టు చేతిలో టెస్టు సిరీస్, ముక్కోణపు సిరీస్ ఓడిన ధోనీసేన.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని ప్రపంచ కప్లో జైత్రయాత్ర కొనసాగించింది. చివరకు ఆసీస్ చేతిలోనే పరాజయం చెంది ప్రపంచ కప్ ఆశలను ఆవిరి చేసుకుంది. అయినా ఈ మెగా ఈవెంట్లో ధోనీసేన ప్రదర్శన ప్రశంసనీయం.



ప్రపంచ కప్ ఆరంభమయ్యే సమయానికి భారత్పై పెద్దగా అంచనాల్లేవు. క్వార్టర్స్ చేరితే గొప్పన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే ప్రపంచ కప్లో ధోనీసేన వీటన్నంటినీ పటాపంచలు చేసింది. ఎవరూ ఊహించని రీతిలో పుంజుకుని అద్భుతాలు చేసింది. బ్యాటింగ్ లైనప్ గాడిన పడగా.. బౌలింగ్ విభాగం పటష్టమైంది. ధోనీసేన రికార్డు విజయాలతో జైత్రయాత్ర సాగించింది. లీగ్ దశలో ఆరు మ్యాచ్ల్లోనూ నెగ్గింది. క్వార్టర్స్లోనూ ఇదే జోరు కొనసాగించింది. ఈ ఏడు మ్యాచ్ల్లోనూ 70కి 70 వికెట్లు పడగొట్టి ధోనీసేన చరిత్ర సృష్టించింది. ప్రపంచ కప్, వన్డే క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా టీమిండియా రికార్డుల పుటలకెక్కింది. ఇక ప్రపంచ కప్లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ధోనీసేన (భారత్ తరపున) మరో రికార్డు నెలకొల్పింది. గత ప్రపంచ కప్లో నాలుగు, తాజా ఈవెంట్తో కలిపి టీమిండియా ఈ రికార్డు సాధించింది.



భారత్ ప్రపంచ కప్లో తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచేసి టీమిండియా జైత్రయాత్రకు శ్రీకారం చుట్టింది. ఆ మరుసటి మ్యాచ్లో పటిష్టమైన దక్షిణాఫ్రికాపై అంచనాలకు మించి రాణించింది. సఫారీలపైనా మనోళ్లు ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత భారత్కు ఎదురేలేకుండా పోయింది. వెస్టిండీస్, ఐర్లాండ్, యూఏఈ, జింబాబ్వేలపై తిరుగులేని విజయాలు నమోదు చేసింది. లీగ్ దశలో అన్ని మ్యాచ్ల్లో నెగ్గి గ్రూపు-బి టాపర్గా భారత్ నిలిచింది. లీగ్ దశలో ఓటమెరుగని జట్లు టీమిండియా, కివీస్లు మాత్రమే. ఇక క్వార్టర్స్లో బంగ్లాదేశ్పై అదే జోరు కొనసాగించింది. కాగా ఆసీస్తో సెమీస్ పోరులో ఓడిపోవడంతో భారత్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top